Viral: ఫ్రీ పిజ్జా.! కానీ ఓ కండీషన్.. అది వింటే గుండె ఆగినంత పనవుతుంది..

Viral: అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక విచిత్రమైన ఘటన వెలుగు చూసింది.

Ravi
By Ravi
Published on: 23 July 2026 9:46 AM IST
Viral
X

Viral: ఫ్రీ పిజ్జా.! కానీ ఓ కండీషన్.. అది వింటే గుండె ఆగినంత పనవుతుంది..

Viral: అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. ఎవరైనా బర్మీస్ పైథాన్ పామును పట్టుకుని వస్తే వారికి రెస్టారెంట్ తరఫున ఉచితంగా లార్జ్ పిజ్జాను అందిస్తున్నారు.

ప్రపంచంలో కొన్నిసార్లు మనం ఊహించని విచిత్రమైన ఆఫర్లు, వ్యాపార ప్రచారాలు కనిపిస్తుంటాయి. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక రెస్టారెంట్ యజమాని ప్రకటించిన వినూత్న పథకం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫ్లోరిడాలోని ఎవర్ గ్లేడ్స్ సిటీలో "వైల్డ్‌మ్యాన్ పిజ్జా" పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్న డస్టిన్ క్రమ్ అనే వ్యక్తి ఈ అరుదైన ఆఫర్‌కు తెరలేపాడు. ఈ రెస్టారెంట్‌కు ఎవరైనా సరే ప్రాణంతో ఉన్న లేదా చంపిన బర్మీస్ పైథాన్ పామును పట్టుకుని వస్తే, వారికి ఉచితంగా ఒక లార్జ్ స్పెషాలిటీ పిజ్జాను బహుమతిగా ఇస్తున్నారు. ప్రపంచంలో పైథాన్ పాములను కరెన్సీలా స్వీకరిస్తున్న ఏకైక రెస్టారెంట్ తమదేనని ఆయన పేర్కొంటున్నారు.

అమెరికాలోని ఫ్లోరిడా అడవుల్లో బర్మీస్ పైథాన్ పాముల బెడద దశాబ్దాలుగా తీవ్ర సమస్యగా మారింది. ఈ భారీ పాములు స్థానిక వన్యప్రాణులను వేటాడటం వల్ల అక్కడి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. ఈ ముప్పును తగ్గించడానికి ఫ్లోరిడా ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా 'పైథాన్ ఛాలెంజ్' పోటీలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక యువతకు, వేటగాళ్లకు ప్రోత్సాహకంగా ఉండేలా డస్టిన్ క్రమ్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు. ప్రజలు ఎంతో కష్టపడి పట్టుకొచ్చే పాములను వృథా చేయకుండా, వాటిని తమ రెస్టారెంట్ కోసం వినియోగిస్తూ వారికి రుచికరమైన పిజ్జాను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాగా, ఆహార భద్రతా నిబంధనల కారణంగా ఈ పాము మాంసాన్ని నేరుగా విక్రయించడానికి అనుమతి లేనందున, దానిని ఉచితంగా వచ్చే కస్టమర్లకు బహుమతిగా ఇస్తున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. అంతేకాకుండా పాము చర్మాన్ని, కొవ్వును, ఎముకలను ఉపయోగించి వివిధ రకాల ఉత్పత్తులు, నూనెలు, సబ్బులు అలాగే ఆభరణాలను తయారు చేస్తున్నామని వారు వెల్లడించారు. పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన రాక్షస పాముల సంఖ్యను తగ్గించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ విభిన్నమైన ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story