Viral Video: ఇల్లే కదా అని కొనుక్కుంటే.. పైకప్పు నుంచి జలపాతంలా పడిన నీరు.!

Viral Video: జీవితకాల సంపాదనతో కొనుగోలు చేసిన ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఒక ఢిల్లీ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. అకస్మాత్తుగా సీలింగ్ పైపు పగిలి ఇంట్లోకి భారీగా నీరు రావడంతో ఇళ్లంతా జలమయమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ravi
By Ravi
Published on: 22 July 2026 7:23 PM IST
Viral Video
X

Viral Video: ఇల్లే కదా అని కొనుక్కుంటే.. పైకప్పు నుంచి జలపాతంలా పడిన నీరు.!

Viral Video: సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతిపెద్ద మైలురాయి. కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఇల్లు కొద్ది రోజుల్లోనే కష్టాల పాలు అయితే ఆవేదన ఎలా ఉంటుందో ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. ఢిల్లీలోని ఒక హౌసింగ్ సొసైటీలో 13వ అంతస్తులో ఉంటున్న ఒక కుటుంబం తమ అపార్ట్‌మెంట్‌లో ఊహించని విపత్తును ఎదుర్కొంది. ఇంటి సీలింగ్ నుంచి ఒక్కసారిగా నీరు విపరీతంగా కారడంతో ఇల్లు కాస్తా జలపాతాన్ని తలపించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సంజు గోయల్ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ వీడియోలో సీలింగ్ నుంచి వర్షం కురిసినట్లుగా నీరు దారాళంగా కారడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ నీటి ఉధృతికి లివింగ్ రూమ్‌లోని ఖరీదైన సోఫా సెట్, కాఫీ టేబుల్ పూర్తిగా తడిచిపోయాయి. ఇల్లంతా నీటితో నిండిపోవడంతో గృహోపకరణాలు దెబ్బతిన్నాయి. ఈ ఫ్లాట్ కోసం బాధితులు దాదాపు రూ. 1.5 కోట్ల నుండి రూ. 2 కోట్ల వరకు వెచ్చించినట్లు సమాచారం.

కాగా, ఈ తీవ్ర నీటి లీకేజీకి అగ్నిమాపక అలారం పైప్‌లైన్ పగిలిపోవడమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. నాణ్యత లేని నిర్మాణ సామగ్రిని ఉపయోగించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని, బిల్డర్, మెయింటెనెన్స్ ఏజెన్సీల నిర్లక్ష్యమే దీనికి కారణమని వారు వాపోతున్నారు. నష్టపోయిన కుటుంబానికి ఎలాంటి బాధ్యత వహించకపోవడంతో, నివాసితులు మెయింటెనెన్స్ ఏజెన్సీపై పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారీ పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేసే అపార్ట్‌మెంట్‌లలో ఇలాంటి నాణ్యతా లోపాలు బయటపడటం పట్ల నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story