Viral: చీఫ్ బ్రేకప్ ఆఫీసర్.. ఏకంగా రూ. 3 లక్షల సాలరీ.. ఇదేం జాబ్ గురూ.!

Viral: ఉద్యోగాల్లో చాలా రకాలు చూసుంటాం. కానీ ఇద్దరు ప్రేమికులను విడగొడితే ఏకంగా రూ. 2.8 లక్షల జీతం ఇచ్చే ఓ విచిత్రమైన జాబ్ ఆఫర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Ravi
By Ravi
Published on: 28 Jun 2026 1:59 PM IST
Viral
X

Viral: చీఫ్ బ్రేకప్ ఆఫీసర్.. ఏకంగా రూ. 3 లక్షల సాలరీ.. ఇదేం జాబ్ గురూ.!

Viral: సాధారణంగా ఉద్యోగాలు అంటే సాఫ్ట్‌వేర్, మార్కెటింగ్, బ్యాంకింగ్ లేదా మేనేజ్‌మెంట్ రంగాల్లో ఉంటాయి. కానీ ఒకరి బంధాన్ని సున్నితంగా బ్రేకప్ చేస్తే లక్షల్లో జీతం ఇస్తామంటూ ఓ డేటింగ్ వెబ్‌సైట్ ఇచ్చిన విచిత్రమైన ఉద్యోగ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. ప్రముఖ డేటింగ్ ప్లాట్‌ఫామ్ అయిన 'Dating.com' తాజాగా 'చీఫ్ బ్రేకప్ ఆఫీసర్' పేరుతో ఓ వినూత్నమైన జాబ్ యాడ్‌ను రిలీజ్ చేసింది. ఇద్దరు ప్రేమికులను విడగొట్టే నైపుణ్యం ఉన్నవారి కోసం సంస్థ వెతుకుతోంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏకంగా రూ. 2.8 లక్షల భారీ వేతనం ముట్టజెబుతుందట. ఇందులో చేయాల్సిన పని ఏంటంటే.. తమ క్లయింట్ తరఫున ఎదుటి వ్యక్తికి వాళ్ల బంధం ముగిసిపోయిందనే విషయాన్ని ఎంతో సున్నితంగా, సానుభూతితో, ఎలాంటి గొడవలు రాకుండా చెప్పాలి.

ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కనీసం 3 బ్రేకప్స్ అనుభవం ఉన్న వారికి ఈ ఉద్యోగ ఎంపికలో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారట. ఇష్టం లేకపోయినా విడిపోలేక బలవంతంగా రిలేషన్‌షిప్‌లో ఉంటూ మానసిక క్షోభ అనుభవిస్తున్న వారికి సహాయం చేసేందుకే తాము ఈ సేవను తీసుకువచ్చినట్లు ఆ సంస్థ వెల్లడించింది. బ్రేకప్ చెప్పలేక ఇబ్బంది పడేవారికి తమ 'చీఫ్ బ్రేకప్ ఆఫీసర్' బాసటగా నిలుస్తాడని పేర్కొంది. ఈ విచిత్రమైన జాబ్ ఆఫర్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story