Viral Video : లైంగిక దాడి నుంచి మహిళను కాపాడిన కుక్కలు.. యువకుడికి చుక్కలు
తమిళనాడులోని కోయంబత్తూరులో మానవత్వానికే నిదర్శనంగా నిలిచే ఒక అసాధారణమైన ఘటన వెలుగు చూసింది. అర్ధరాత్రి సమయంలో మానసిక వికలాంగురాలైన ఒక మహిళపై
Coimbatore Incident
తమిళనాడులోని కోయంబత్తూరులో మానవత్వానికే నిదర్శనంగా నిలిచే ఒక అసాధారణమైన ఘటన వెలుగు చూసింది. అర్ధరాత్రి సమయంలో మానసిక వికలాంగురాలైన ఒక మహిళపై లైంగిక దాడికి యత్నించిన 17 ఏళ్ల యువకుడిని వీధి కుక్కలు తరిమికొట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆ కుక్కల ధైర్యాన్ని వేనోళ్ల కొనియాడుతున్నారు.
అర్ధరాత్రి వేళ దారుణం
పోలీసుల కథనం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో తుడియాలూర్ సమీపంలోని ఒక రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ సర్వీస్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. మానసికంగా స్థిరత్వం లేని ఒక మహిళ రోడ్డు పక్కన కూర్చుని ఉండగా, ఆమెకు సమీపంలోనే రెండు వీధి కుక్కలు కూడా ఉన్నాయి. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ఒక 17 ఏళ్ల టీనేజ్ యువకుడు ఆ మహిళ వద్దకు వచ్చాడు. మొదట ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించిన అతడు, ఆ తర్వాత రాతిని తీసి అక్కడ ఉన్న కుక్కలను బెదిరించి తోసివేసేందుకు యత్నించాడు. కుక్కలు కొద్దిగా వెనక్కి తగ్గినప్పటికీ అతనిపై నిరంతరం మొరుగుతూనే ఉన్నాయి.
మహిళ కేకలు.. వీరాలాంటి కుక్కల దాడి
యువకుడు ఆ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించగా, భయపడిన ఆమె బిగ్గరగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న వెంటనే అక్కడ ఉన్న రెండు కుక్కలు ఒక్కసారిగా ఆ యువకుడిపైకి లంఘించాయి. ఆ కుక్కలు అతడి కాళ్లను కొరుకుతూ, మహిళ నుంచి దూరంగా లాగిపారేశాయి. కుక్కల దాడితో తీవ్రంగా భయపడిపోయిన ఆ యువకుడు అక్కడి నుంచి పరుగులు తీశాడు. అతడు పారిపోతున్న సమయంలో కూడా ఒక కుక్క అతడిని కొంతదూరం వరకు తీవ్రంగా తరిమింది.
సీసీటీవీ ఆధారంగా నిందితుడి అరెస్ట్
ఈ ఘటన అంతా సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఉదయాన్నే బాధితురాలి పరిస్థితిని గమనించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఈ నిజం బయటపడింది. దృశ్యాల ఆధారంగా నిందితుడైన 17 ఏళ్ల యువకుడిని గుర్తించిన పోలీసులు అదే రోజు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.
నెటిజన్ల ప్రశంసల జల్లు
ఈ సీసీటీవీ వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో వీధి కుక్కల స్పందనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. "మనం వీధి కుక్కలను కేవలం ప్రమాదకరమైనవిగా చూస్తాం, కానీ అర్ధరాత్రి వేళ ఆపదలో ఉన్న మహిళను కాపాడి అవి నిజమైన హీరోలుగా నిలిచాయి. ఇవి కేవలం కుక్కలు కావు, రక్షకులు" అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మనుషుల కంటే ఆ వీధి కుక్కలకే ఎక్కువ మానవత్వం ఉందంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
🐕 STRAY DOGS INTERVENE IN ALLEGED ASSAULT ATTEMPT IN COIMBATORE
— contentkikamii (@contentkikamii) September 4, 2026
Two stray dogs reportedly intervened when a minor boy allegedly attempted to sexually assault a mentally ill woman near a railway overbridge in Thudiyalur, Coimbatore, around 2 AM on Thursday, September 3.
CCTV… pic.twitter.com/YQ8332Zupk




