Public Romance: క్యాబ్‌లో జంట రాసలీలలు... డ్రైవర్ రియాక్షన్ మైండ్ బ్లాక్..!

Public Romance: క్యాబ్‌లో హద్దులు మీరి ప్రవర్తించిన జంటకు ఒక డ్రైవర్ గట్టిగా బుద్ధి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Naresh.k
Published on: 23 July 2026 2:52 PM IST
Public Romance
X

Public Romance: క్యాబ్‌లో జంట రాసలీలలు... డ్రైవర్ రియాక్షన్ మైండ్ బ్లాక్..!

Couple In Cab: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. కానీ, కొన్ని వీడియోలు మాత్రం విపరీతంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించి, పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా ఓ క్యాబ్‌లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్‌ఇంట్లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని దృశ్యాల ప్రకారం... ఒక జంట క్యాబ్ వెనుక సీట్లో ప్రయాణిస్తూ హద్దులు మీరి ప్రవర్తించారు. మొదట డ్రైవర్ వారి చర్యలను గమనించి కాస్త సహనంతోనే ఉన్నాడు. కానీ, ఆ జంట తమ అనుచిత ప్రవర్తనను కొనసాగించడంతో ఓపిక నశించిన డ్రైవర్, వెంటనే కార్‌ను పక్కకు ఆపేశాడు.

ఇది మీ పర్సనల్ రూమ్ కాదు... పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. ఇక్కడ ఇలాంటి చిల్లర పనులు, అసభ్య ప్రవర్తనలు అస్సలు కుదరవు. కాస్త మర్యాదగా ప్రవర్తించండి అని గట్టిగా నిలదీశాడు. డ్రైవర్ గట్టిగా క్లాస్ పీకడంతో ఆ జంట వెంటనే వెనక్కి తగ్గి, విడివిడిగా కూర్చున్నారు. అయితే, వారు స్పందించిన తీరు, డ్రైవర్ ప్రదర్శించిన ధైర్యం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన క్షణం నుంచే వ్యూస్, కామెంట్లతో దూసుకుపోతోంది. క్యాబ్ అనేది ప్రైవేట్ స్పేస్ కాదు, అక్కడ పబ్లిక్ రూల్స్, మర్యాదలు పాటించాల్సిందే అని మెజారిటీ నెటిజన్లు డ్రైవర్ చర్యను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నారు. మరికొందరేమో ఈ ఘటనపై మీమ్స్ చేస్తూ, సరదా కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారు? అసలు ఇందులో ఉన్నది నిజమైన ప్రయాణికులేనా లేక వ్యూస్ కోసం చేసిన ప్రాంక్ వీడియోనా? అనే విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియా యుగంలో పబ్లిక్ ప్లేసుల్లో వ్యక్తిగత ప్రవర్తన, గోప్యత, ప్రయాణికుల బాధ్యతలపై ఈ వీడియో మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.



Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story