Brain Test: ఈ పజిల్‌కు 10 సెకన్లలో ఆన్సర్ చెప్పగలరా?.. అయితే మీకంటే తోపెవరు లేరు!

Viral Brain Test Puzzle. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పజిల్‌కు 10 సెకన్లలో సమాధానం చెప్పగలిగితే మీకంటే తోపెవరు లేరు.

Rishvik
Published on: 16 Aug 2026 10:45 AM IST
Brain Test
X

Brain Test: ఈ పజిల్‌కు 10 సెకన్లలో ఆన్సర్ చెప్పగలరా?.. అయితే మీకంటే తోపెవరు లేరు!

Brain Test: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని బ్రెయిన్ టీజర్, మ్యాథ్స్ పజిల్స్ మన లాజికల్ థింకింగ్, పరిశీలనా శక్తికి పరీక్ష పెడుతుంటాయి. ఇవి పైకి చాలా సులభంగా కనిపించినా.. వాటిలో దాగి ఉన్న లాజిక్‌ను గుర్తించడం మాత్రం అంత ఈజీ కాదు. తాజాగా అలాంటి ఓ నంబర్ పజిల్ నెటిజన్లను తెగ ఆలోచింపజేస్తోంది. 10 సెకన్లలో సమాధానం చెప్పగలిగితే.. మీ లాజికల్ థింకింగ్ అదిరిపోయినట్టే. 10 సెకన్లలో ఆన్సర్ చెబితే.. మీకంటే తోపెవరు లేరు అంటూ ఈ పజిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇంతకీ పజిల్ ఏంటి?:

ఈ పజిల్‌లో కొన్ని సంఖ్యలకు ఎదురుగా వాటి సమాధానాలు ఇచ్చారు. వాటి ఆధారంగా చివరరి వరసలో ఉన్న దానికి సమాధానం ఏంటో అని ప్రశ్నించారు.

501 = 16

502 = 27

503 = 38

504 = ??

అసలు ట్విస్ట్ వేరేలా:

మొదటి మూడు సమీకరణాలను చూసి చాలామంది ఏదో ఒక సాధారణ గుణకారం లేదా కూడిక లాజిక్‌ను ఊహిస్తారు. కానీ అసలు ట్విస్ట్ వేరేలా ఉంది. ఈ పజిల్‌లో ముందుగా 501, 502, 503, 504 సంఖ్యల్లో చివరి అంకెను గమనించాలి. ప్రతి వరుసలో ఆ చివరి అంకెకు అనుగుణంగా 10, 20, 30, 40 అనే విలువలను తీసుకుని.. అదే సమయంలో 5తో ఆ చివరి అంకెను కలపాలి.

501 → 10 + (5 + 1) = 10 + 6 = 16

502 → 20 + (5 + 2) = 20 + 7 = 27

503 → 30 + (5 + 3) = 30 + 8 = 38

ఇదే లాజిక్‌ను చివరి సమీకరణానికి వర్తింపజేస్తే:

504 → 40 + (5 + 4)

= 40 + 9

= 49

ఈ పజిల్‌కు సరైన సమాధానం 49.

మీరూ 10 సెకన్లలో గుర్తించారా?:

ఈ పజిల్‌లో అసలు ఛాలెంజ్ క్లిష్టమైన గణితం చేయడం కాదు.. సంఖ్యల మధ్య ఉన్న ప్యాటర్న్‌ను త్వరగా గుర్తించడం. 501, 502, 503 నుంచి వచ్చే 16, 27, 38 విలువలను జాగ్రత్తగా పరిశీలిస్తే.. ప్రతి దశలో 11 చొప్పున పెరుగుతున్నట్లు కూడా గమనించవచ్చు. అదే క్రమంలో 38కు మరో 11 కలిపితే 49 వస్తుంది. కాబట్టి ఈ వైరల్ బ్రెయిన్ టీజర్‌కు సరైన సమాధానం 49. మీరు కూడా ఈ పజిల్‌ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసి.. వారు ఎంత సమయంలో సరైన సమాధానం గుర్తిస్తారో పరీక్షించండి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story