Brain Test: ఈ ఫ్రూట్ పజిల్‌కు ఆన్సర్ చెప్పగలరా?.. 10 సెకన్లలో సాల్వ్ చేస్తే మీరే తోపు!

Brain Test: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బ్రెయిన్ టీజర్లు, మ్యాథ్స్ పజిల్స్, ఫ్రూట్ పజిల్స్ నెటిజన్లకు ఓ ఛాలెంజ్ విసురుతున్నాయి.

Rishvik
Published on: 17 Aug 2026 8:32 PM IST
Brain Test
X

Brain Test: ఈ ఫ్రూట్ పజిల్‌కు ఆన్సర్ చెప్పగలరా?.. 10 సెకన్లలో సాల్వ్ చేస్తే మీరే తోపు!

Brain Test: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బ్రెయిన్ టీజర్లు, మ్యాథ్స్ పజిల్స్, ఫ్రూట్ పజిల్స్ నెటిజన్లకు ఓ ఛాలెంజ్ విసురుతున్నాయి. పైకి చాలా సింపుల్‌గా కనిపించే ఈ పజిల్స్‌లో దాగి ఉన్న లాజిక్‌ను గుర్తించడమే అసలు టాస్క్. తాజాగా ఫ్రూట్ పజిల్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ టమాటా, స్ట్రాబెర్రీలతో రూపొందించిన ఫ్రూట్ పజిల్ నెటిజన్లను తెగ ఆలోచింపజేస్తోంది. ఈ పజిల్‌కు మీరు 10 సెకన్లలో సమాధానం చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు.

ఇంతకీ పజిల్ ఏంటి?:

ఈ వైరల్ పజిల్‌లో ముందుగా టమాటా, స్ట్రాబెర్రీల మధ్య కూడిక ఇచ్చారు. ఆ తర్వాత అదే రెండు పండ్ల మధ్య తీసివేతను చూపించారు. చివరగా వాటి మధ్య గుణకారం చేసి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

టమాటా + స్ట్రాబెర్రీ = 6

టమాటా − స్ట్రాబెర్రీ = 2

టమాటా × స్ట్రాబెర్రీ = ?

ఏదో కొత్త ట్విస్ట్:

చాలామంది చివరి సమీకరణను చూసి వెంటనే ఏదో కొత్త ట్విస్ట్ ఉంటుందని భావిస్తారు. కానీ ఈ చిత్రంలో కనిపిస్తున్న టమాటా, స్ట్రాబెర్రీలలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి మొదటి రెండు సమీకరణాల ఆధారంగా వాటి విలువలను గుర్తిస్తే సరిపోతుంది. ముందుగా టమాటా విలువను గుర్తించాలి. టమాటా విలువను T, స్ట్రాబెర్రీ విలువను Sగా తీసుకుందాం.

మొదటి సమీకరణ ప్రకారం:

T + S = 6

రెండో సమీకరణ:

T − S = 2

ఈ రెండు సమీకరణాలను కలిపితే:

2T = 8

అంటే టమాటా విలువ 4.

అప్పుడు మొదటి సమీకరణలో 4ని ప్రతిక్షేపిస్తే:

4 + S = 6

కాబట్టి స్ట్రాబెర్రీ విలువ 2.

మరి చివరి సమాధానం ఎంత?:

ఇప్పుడు చివరి సమీకరణలో టమాటా × స్ట్రాబెర్రీ విలువలను ఉంచాలి.

4 × 2 = 8

ఈ వైరల్ ఫ్రూట్ పజిల్‌కు సరైన సమాధానం 8.

కష్టమైన గణితం ఏమీ లేదు:

ఈ పజిల్‌లో కష్టమైన గణితం ఏమీ లేదు. ఇచ్చిన రెండు సమీకరణాల నుంచి టమాటా, స్ట్రాబెర్రీ విలువలను గుర్తించి.. చివర్లో గుణిస్తే సమాధానం సులభంగా వచ్చేస్తుంది. మీరు కూడా 10 సెకన్లలోనే 8 అని గుర్తించారా?.. అయితే మీ లాజికల్ థింకింగ్ బాగున్నట్టే. ఈ పజిల్‌ను మీ సన్నిహితులకు పంపి వారి ఐక్యూని ఓసారి పరిశీలించండి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story