Photo Puzzle: ఈ ఫోటోలో 'N' అక్షరం ఎక్కడుందో కనిపెట్టగలరా.? 5 సెకన్లలో గుర్తిస్తే మీరే జీనియస్..
Photo Puzzle: సోషల్ మీడియాలో రోజుకో కొత్త బ్రెయిన్ టీజర్ లేదా ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతూనే ఉంటాయి.
Photo Puzzle: ఈ ఫోటోలో 'N' అక్షరం ఎక్కడుందో కనిపెట్టగలరా.? 5 సెకన్లలో గుర్తిస్తే మీరే జీనియస్..
Photo Puzzle: సోషల్ మీడియాలో రోజుకో కొత్త బ్రెయిన్ టీజర్ లేదా ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలు విపరీతంగా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇవి చూడటానికి కేవలం ఫన్ గేమ్స్ లాగే అనిపించినా, వాస్తవానికి ఇవి మన మెదడుకు వ్యాయామాన్ని ఇస్తాయి. ఉరుకులు పరుగుల జీవితంలో మన ఏకాగ్రతను, కంటి చూపు తీరును పరీక్షించుకోవడానికి ఇలాంటి చిన్నపాటి పజిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. తాజాగా నెట్టింట హల్చల్ చేస్తోన్న ఓ ఐక్యూ టెస్ట్ ఇప్పుడు చూసేద్దాం.
ఈ బ్రెయిన్ టీజర్ అసలు కాన్సెప్ట్ ఏంటంటే.. మీ ముందున్న చిత్రంలో ఒకేలాంటి అక్షరాలు వరుసగా పేర్చి ఉంటాయి. కంటికి అన్నీ ఒకేలా కనిపిస్తాయి కానీ, వాటి మధ్యలో ఎక్కడో ఒకచోట భిన్నమైన అక్షరం ఎవరికీ చిక్కకుండా చాలా తెలివిగా దాగి ఉంటుంది. ఇక ఫోటో విషయానికొస్తే.. పై ఫోటోలో అన్ని వరుసలలోనూ 'M' అక్షరం ఉంది. అది మీకు కూడా కనిపిస్తోంది. అయితే ఎక్కడో ఒక చోట రెండు 'N' అక్షరాలు దాగి ఉన్నాయి. అవి ఎక్కడున్నాయో మీరు తెలుసుకోవాలి.
కేవలం 5 లేదా 10 సెకన్ల వ్యవధిలోనే మీ కళ్లతో స్కాన్ చేసి కనిపెట్టాలి. వినడానికి చాలా సింపుల్‌గా అనిపించినా, తీరా ఆ చిత్రాన్ని చూస్తే మాత్రం అక్షరాలన్నీ కలిసిపోయి కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్ చేయడం వల్ల మన బ్రెయిన్‌లోని కుడి, ఎడమ భాగాలు రెండూ ఎంతో చురుకుగా పనిచేస్తాయని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఒక విషయాన్ని ఎంత నిశితంగా గమనిస్తున్నాం, ఎంత వేగంగా స్పందిస్తున్నాం అనేది ఇలాంటి ఐక్యూ టెస్టుల ద్వారా సులభంగా అర్థమవుతుంది. పజిల్ చూడగానే మొదటి చూపులోనే ఆ తేడాను కనిపెట్టగలిగితే మీరు నిజంగా జీనియస్సే.




