Blinkit Viral : రూ.15 ఆర్డర్.. రూ.500 టిప్.. డెలివరీ బాయ్ ఎమోషనల్.!
Blinkit Viral : సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందనే విషయాన్ని రుజువు చేసే కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు నెటిజన్ల మనసులను గెలుచుకుంటాయి. తాజాగా..
Blinkit-Viral
Blinkit Viral : సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందనే విషయాన్ని రుజువు చేసే కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు నెటిజన్ల మనసులను గెలుచుకుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక డెలివరీ బాయ్ వీడియో చూస్తే ఎవరికైనా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఆన్‌లైన్ గ్రాసరీ ప్లాట్‌ఫారమ్ 'బ్లింకిట్' (Blinkit) లో కేవలం రూ. 15 విలువైన ఆర్డర్‌ను డెలివరీ చేసినందుకు, ఒక మహిళ సదరు డెలివరీ రైడర్‌కు ఏకంగా రూ. 500 టిప్ ఇచ్చింది. ఆ ఊహించని సాయానికి ఆ యువకుడు ఎమోషనల్ అయిన విధానం ఇప్పుడు నెటిజన్లను కదిలిస్తోంది.
దీదీ ఇచ్చిన బిగ్ సర్ప్రైజ్
ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఐ యామ్ బ్లింకిట్ రైడర్' అనే అకౌంట్ ద్వారా ఒక డెలివరీ బాయ్ రోజూ తను చేసే ఉద్యోగ విశేషాలను వీడియోల రూపంలో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా అతను షేర్ చేసిన వీడియోలో, తన ఫోన్ స్క్రీన్‌ను కెమెరా వైపు చూపిస్తూ.. తనకు వచ్చిన ఒక నోటిఫికేషన్‌ను చూసి నమ్మలేకపోయాడు. "నేను డెలివరీ చేసిన ఆర్డర్ విలువ కేవలం 15 రూపాయలు మాత్రమే. కానీ ఆ దీదీ నాకు ఎంత టిప్ ఇచ్చారో తెలుసా? ఏకంగా రూ. 500 ఇచ్చారు" అని ఎంతో ఆనందంతో, ఆశ్చర్యంతో చెప్పాడు.
కన్నీళ్లు పెట్టుకున్న డెలివరీ బాయ్
ఆ కస్టమర్ చేసిన సాయానికి ఆ రైడర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. కెమెరా ముందు చేతులు జోడించి.. "థాంక్యూ సో మచ్ దీదీ.. నా రోజువారీ సంపాదన కూడా ఈ స్థాయిలో ఉండదు. నాకు ఇంత పెద్ద మొత్తంలో టిప్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్" అంటూ పదే పదే కృతజ్ఞతలు తెలిపాడు. అతని గొంతులో వినిపించిన ఆ అమాయకత్వం, నిజాయితీతో కూడిన కృతజ్ఞత చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కదిలిపోతున్న నెటిజన్లు
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "మనం చేసే ఒక చిన్న మంచి పని, ఎదుటివారి జీవితంలో ఎంతటి పెద్ద మార్పును తీసుకువస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం" అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడి పైకి వచ్చిన వారికే ఎదుటివారి కష్టం విలువ తెలుస్తుందని, బహుశా ఆ మహిళ కూడా ఆ ఉద్దేశంతోనే అంత పెద్ద మనసు చేసుకుని సాయం చేసి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రోజువారీ జీవితంలో తోటి మనుషుల పట్ల చూపించే చిన్నపాటి దయ, వారి ముఖాల్లో ఎంతటి పెద్ద నవ్వును పూయిస్తుందో ఈ వీడియో అందరికీ గుర్తుచేస్తోంది.
A ₹15 food order... but a ₹500 tip
— Avantika rishishwer (@ki_radhe65022) June 30, 2026
that left a delivery partner
speechless🥰
Small act. Big heart
Humanity still shines❤️👇 pic.twitter.com/QAgNdJwDnc




