Viral: ఆకలి వేస్తోందని పావ్ బాజీ ఆర్డర్ ఇచ్చాడు.. ఓపెన్ చేసి చూడగా.!

Viral: బెంగళూరులో జొమాటోలో పావ్ భాజీ ఆర్డర్ చేసిన వ్యక్తికి అందులో సగం కాల్చిన బీడీ రావడం వైరల్ అవుతోంది.

Ravi
By Ravi
Published on: 2 Sept 2026 7:13 PM IST
Viral
X

Viral: ఆకలి వేస్తోందని పావ్ బాజీ ఆర్డర్ ఇచ్చాడు.. ఓపెన్ చేసి చూడగా.!

Viral: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల పుణ్యమా అని ఇంట్లో కూర్చునే నచ్చిన ఆహారాన్ని తెప్పించుకుని తినడం ప్రతి ఒక్కరికీ అలవాటుగా మారింది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా క్షణాల్లో ఆహారాన్ని డెలివరీ చేస్తూ సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అయితే చాలాసార్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్‌లో పురుగులు, కీటకాలు, బొద్దింకలు రావడం గురించి మనం విన్నాం. కానీ బెంగళూరు నగరంలో ఒక వ్యక్తికి ఏకంగా వింతైన అనుభవం ఎదురైంది. ఆన్‌లైన్ యాప్ జొమాటో ద్వారా పావ్ భాజీని ఆర్డర్ చేస్తే అందులో ఏకంగా పూర్తిగా కాల్చిన బీడీ దర్శనమిచ్చింది. ఈ చేదు అనుభవానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే వస్తున్న ఇలాంటి ఫ్రీ గిఫ్ట్‌లు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడంతో పాటు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరు నగరానికి చెందిన ప్రియమ్ తహబిల్దార్ అనే యువకుడు రీసెంట్‌గా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో నుంచి పావ్ భాజీ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్లిన తర్వాత, ఆకలితో ఆ పార్సిల్ ఓపెన్ చేసిన అతడికి కళ్లు బైర్లు కమ్మాయి. ప్లేట్‌లో రుచికరమైన పావ్ భాజీతో పాటు ఉల్లిపాయ ముక్కల పక్కన సగం వరకు పూర్తిగా కాల్చేసిన ఒక బీడీ దర్శనమిచ్చింది. ముందుగా ఆశ్చర్యపోయిన ప్రియమ్, ఆ తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇలాంటి చెత్తను కస్టమర్లకు పంపిస్తారా అంటూ జొమాటో యాజమాన్యాన్ని నిలదీస్తూ ఆ ఫోటోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడు. "జొమాటోలో పావ్ భాజీ ఆర్డర్ చేశాను, దానికి ఫ్రీగా ఒక బీడీ కూడా వచ్చింది. అయితే ఆ బీడీ పూర్తిగా కాల్చేసి ఉంది. నిజాయితీగా చెప్పాలంటే నేను కోరుకున్న ఫ్రీ గిఫ్ట్ ఇది కాదు, జొమాటో కేర్" అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫుడ్ ప్యాకింగ్, హోటళ్ల నిర్వహణ, శుభ్రత ప్రమాణాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ పోస్ట్‌పై సరదాగా కామెంట్లు కూడా పెడుతున్నారు. "పావ్ భాజీకి అదనపు స్మోక్ ఫ్లేవర్ యాడ్ చేశారు" అని ఒకరు, "ఇలాంటివి ఎదురైనప్పుడే ఇంట్లో వండిన ఆహారం విలువ మనకు తెలుస్తుంది" అని మరొకరు కామెంట్ చేశారు. కొంతమంది జొమాటోను సమర్థిస్తూ, వంట చేయడం, ప్యాకింగ్ చేయడం ఆయా హోటళ్ల బాధ్యత అని, డెలివరీ మాత్రమే చేసే జొమాటోను నిందించడం సరికాదని వాదించారు. ఆ తప్పు చేసిన సదరు రెస్టారెంట్ పేరును కూడా ఆ పోస్ట్‌లో బహిర్గతం చేయాలని వారు ప్రియమ్‌కు సూచించారు.

ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో జొమాటో కస్టమర్ కేర్ ప్రతినిధులు వెంటనే స్పందించారు. ప్రియమ్ తహబిల్దార్‌ను సంప్రదించి జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో అతను చేసే తదుపరి ఆర్డర్ కోసం పరిహారంగా రూ. 100 కూపన్ అందించినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ప్రియమ్ తన సోషల్ మీడియా ఖాతాలో అప్‌డేట్ చేశాడు. అయితే ప్రజల ఆరోగ్యంతో నేరుగా ముడిపడి ఉన్న ఆహార పదార్థాల తయారీ, ప్యాకింగ్ విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం ఏమాత్రం తగదని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోట్లో పెట్టుకుని కాల్చిన బీడీని ఫుడ్‌లో కలపడం పట్ల మండిపడుతున్నారు.

సంబంధిత ఆహార భద్రతా అధికారులు ఆయా హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించి శుభ్రత ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే వారికి భారీ స్థాయిలో రూ. 1 లక్ష లేదా రూ. 5 లక్షలు చొప్పున జరిమానాలు వసూలు చేయాలని పలువురు సూచిస్తున్నారు. కస్టమర్లు పార్సిల్ తీసుకున్న తర్వాత ఫుడ్ లోపల ఏమైనా ఉన్నాయో లేదో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకుని తినడం ఎంతో ఉత్తమం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story