Viral: ఆడోళ్లా మజాకానా.! ఈ టెక్కీ నెల ఖర్చు ఏకంగా రూ. 71 వేలు.. నెట్టింట రచ్చ..
Viral: బెంగళూరుకు చెందిన టెకీ అంజలి తన నెలవారీ ఖర్చుల వివరాలను చెబుతూ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేవలం ఒక నెలలోనే ఆమె ఏకంగా రూ. 71,000 ఖర్చు చేసినట్లు వెల్లడించింది.
Viral: ఆడోళ్లా మజాకానా.! ఈ టెక్కీ నెల ఖర్చు ఏకంగా రూ. 71 వేలు.. నెట్టింట రచ్చ..
Viral: భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరు మహానగరంలో ఐటీ ఉద్యోగుల జీవనశైలి, అక్కడ ఉండే ఖర్చులు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.
పెరిగిపోతున్న ఇళ్ల అద్దెలు, రోజువారీ ఖర్చుల వల్ల నెలాఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి కూడా మిగలడం లేదని చాలామంది టెకీలు వాపోతుంటారు.
తాజాగా బెంగళూరుకు చెందిన అంజలి అనే మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగి తన నెలవారీ ఖర్చుల వివరాలను లెక్కిస్తూ చేసిన ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతూ చర్చకు దారితీసింది.
ఆమె తన వీడియోలో 'ఒక కార్పొరేట్ గర్ల్‌గా నేను నెలకు ఎంత ఖర్చు పెడతాను' అనే విషయాలను పంచుకున్నారు. అందులో ఆమె పేర్కొన్న ఖర్చుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇంటి అద్దె: బెంగళూరులో ఒక 1BHK ఫ్లాట్ కోసం ఆమె నెలకు ఏకంగా రూ. 28,000 రెంట్ చెల్లిస్తున్నారు.
ఆహారం: ప్రతినెలా ఫుడ్ (ఆహార పదార్థాలు/జొమాటో/స్విగ్గీ) కోసం సుమారు రూ. 7,000 ఖర్చవుతుంది.
షాపింగ్: వారాంతాల్లో చేసే షాపింగ్‌ల కోసం రూ. 12,000 నుంచి రూ. 15,000 వరకు వెచ్చిస్తున్నారు.
ప్రయాణాలు/టూర్లు: ఖాళీ సమయాల్లో తిరగడానికి, టూర్ల కోసం మరో రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు ఖర్చు అవుతుందని తెలిపారు.
ఈ లెక్కల ప్రకారం కేవలం గత మే నెలలోనే ఆమె మొత్తం రూ. 71,000 ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అంతటితో ఆగకుండా, "బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీలో నివసించేటప్పుడు ఈ మాత్రం ఖర్చవ్వడం సహజమే కదా.. ఇదేం అంత పెద్ద అమౌంట్ కాదు" అంటూ ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక సింగిల్ పర్సన్ నెలకు రూ. 71,000 ఖర్చు చేయడం చాలా ఎక్కువని కొందరు అంటుంటే.. ఈమెను చూస్తుంటే కేవలం డబ్బులు ఖర్చు పెట్టడానికే పుట్టినట్లు ఉందని మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే బెంగళూరులో ఐటీ కల్చర్‌కు అలవాటు పడిన లైఫ్స్టైల్లో ఈ స్థాయి ఖర్చులు సాధారణమే అని కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.




