Viral: బెంగళూరులో నెలకు రూ. 6 వేలు జీతం.! వినడానికే విచిత్రంగా ఉంది కదూ.. ఇక బ్రతకడమెలా.?

Viral: బెంగళూరు నగరంలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌కు నెలకు కేవలం ₹6,000 జీతం ఇస్తున్నారన్న విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

Ravi
By Ravi
Published on: 8 July 2026 8:00 PM IST
Viral
X

Viral: బెంగళూరులో నెలకు రూ. 6 వేలు జీతం.! వినడానికే విచిత్రంగా ఉంది కదూ.. ఇక బ్రతకడమెలా.?

Viral: భారతదేశంలోని ఐటీ రాజధాని అయిన బెంగళూరు లాంటి ఖరీదైన నగరంలో జీవించడం సామాన్యులకు కత్తిమీద సామే. అలాంటి నగరంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో కిండర్ గార్టెన్ టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళకు నెలకు కేవలం రూ. 6,000 మాత్రమే జీతం ఇస్తున్నారన్న విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.

ఈ విషయంపై ఆమె బావగారు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. "ఈ రోజుల్లో బెంగళూరు లాంటి నగరంలో నెలకు రూ. 6 వేలతో ఎవరైనా ఎలా బతకగలరు?" అని ఆయన ప్రశ్నించడం నెటిజన్లను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రైవేట్ విద్యాసంస్థలు టీచర్లకు ఇచ్చే అతి తక్కువ వేతనాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ఒకవైపు విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తుండగా, మరోవైపు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులకు కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా వారి శ్రమను దోచుకుంటున్నాయని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న టీచర్ల పరిస్థితి ఇంత దయనీయంగా ఉండటం శోచనీయమని, ప్రైవేట్ స్కూళ్లలో వేతనాల దోపిడీని అరికట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లు ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాలను మరోసారి కళ్లకు కట్టింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story