Wife Kills Husband: ఇలా తయ్యారేంటక్కా . చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య..!

Wife Kills Husband: మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో చీర కొనివ్వలేదన్న పట్టుదలతో భార్య ప్రెషర్ కుక్కర్‌తో భర్తను కొట్టి, గొంతు నులిమి హత్య చేసింది.

Naresh.k
Published on: 23 July 2026 11:49 AM IST
Wife Kills Husband
X

Wife Kills Husband: ఇలా తయ్యారేంటక్కా . చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య..!

Wife Kills Husband: సంసారంలో చిన్నపాటి గొడవలు రావడం సహజమే. కానీ ఆ క్షణికావేశం ఒక ప్రాణాన్ని తీసి, కుటుంబాన్ని రోడ్డున పడేసే స్థాయికి చేరింది. మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పెళ్లి, పిల్లలు, సంసారం అన్నాక భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడం సాధారణమే. అయితే ఆ కోపం హద్దులు దాటితే ఎంతటి ఘోరానికైనా దారితీస్తుందని నిరూపించే ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. కేవలం ఒక చీర కొనివ్వలేదన్న పట్టుదలతో మొదలైన వివాదం.. చివరకు భర్త హత్యకు దారితీసింది.

మహారాష్ట్రలోని బద్లాపూర్ ఈస్ట్ పరిధిలోని శిర్గావ్‌లో హరేరామ్ సింగ్ తన భార్య సునీతా దేవి, 7 ఏళ్ల కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. అయితే, మంగళవారం సాయంత్రం తనకి కొత్త చీర కొనివ్వాలని సునీతా దేవి భర్తను కోరింది. దానికి హరేరామ్ సింగ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ పెద్దదయ్యాడు. ఆవేశంతో ఊగిపోయిన సునీతా దేవి కిచెన్‌లో ఉన్న ప్రెషర్ కుక్కర్‌ తెచ్చి భర్త తలపై బలంగా బాదింది. దెబ్బకు అతడు కిందపడిపోగా.. అంతటితో ఆగక అతని గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. హరేరామ్ సింగ్ అంగవైకల్యం కారణంగా మంచానికే పరిమితం కావడంతో, భార్య చేసిన దాడి నుంచి తన్ను తాను కాపాడుకోలేకపోయాడు.

భర్త ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాక, సునీతా దేవి చాలా తెలివిగా పోలీసులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. తానే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి, ఈ హత్యతో తనకు సంబంధం లేనట్లు నటించి తప్పించుకోవాలని చూసింది. అయితే, ఈ ఘోరం జరుగుతున్న సమయంలో వాళ్ల 7 ఏళ్ల చిన్న కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. పోలీసులు రంగంలోకి దిగి ఆ చిన్నారిని ప్రేమగా విచారించడంతో, కంటిముందు జరిగిన దారుణాన్ని బాలుడు పూసగుచ్చినట్లు చెప్పేశాడు. కుమారుడు ఇచ్చిన సాక్ష్యంతో అసలు నిజం బయటపడటంతో సునీతా దేవిని బద్లాపూర్ ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ దంపతుల మధ్య గతంలోనూ తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఈ హత్య కేవలం ఒక చీర గొడవ వల్లే జరిగిందా? లేక దీని వెనుక ఇతర కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, ఆధారాలు తుడిచిపెట్టేందుకు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు. క్షణికావేశంలో భార్య చేసిన పనికి భర్త ప్రాణాలు పోగా, తల్లి జైలు పాలైంది.. చివరికి ఆ 7 ఏళ్ల చిన్నారి అనాథగా మారడం అందరినీ కలచివేస్తోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story