Viral Video: "మమ్మల్ని చైనీస్ అనొద్దు.. మేము భారతీయులమే".. నెటిజన్లను కదిలిస్తున్న అరుణాచల్ పాప వీడియో!

Viral Video: "మేము భారతీయులమే, మమ్మల్ని చైనీస్ అనొద్దు" అంటూ అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 10 ఏళ్ల చిన్నారి వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Arun Chilukuri
Published on: 21 Aug 2026 11:27 AM IST
Viral Video
X

 Viral Video: "మమ్మల్ని చైనీస్ అనొద్దు.. మేము భారతీయులమే".. నెటిజన్లను కదిలిస్తున్న అరుణాచల్ పాప వీడియో!

Viral Video: "ఇతరులు మమ్మల్ని చైనీస్ అంటే చాలా బాధ, కోపం కలుగుతాయి. మేము భారతీయులమే.. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో ఉంటాం. దయచేసి మమ్మల్ని చైనీస్ అనొద్దు" అంటూ ఓ పదేళ్ల చిన్నారి చేతులు జోడించి వేడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సరిహద్దు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తరచూ ఎదుర్కొనే జాతి వివక్షను ఈ 56 సెకండ్ల వీడియో కళ్లకు కట్టినట్లు చూపుతోంది.

కేవలం శారీరక రూపురేఖల ఆధారంగా వ్యక్తుల జాతీయతను, గుర్తింపును ప్రశ్నించే ధోరణిని ఈ అరుణాచల్ ప్రదేశ్ చిన్నారి తన అమాయకమైన మాటలతో నిలదీసింది. భారతదేశపు అసలైన బలమే దాని 'వైవిధ్యం' అని పేర్కొంటూ, ఈ బాలిక స్పందనకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది.

ఈ వీడియోపై స్పందించిన పలువురు నెటిజన్లు ఈశాన్య పౌరుల పట్ల ప్రదర్శిస్తున్న వివక్షపై ఆవేదన వ్యక్తం చేశారు.

'ఎక్స్' (Twitter) వేదికగా ఒక నెటిజన్ స్పందిస్తూ.. "ఈ చిన్నారి మాటలు నేరుగా మనసును తాకుతున్నాయి. నిజమైన భారతీయత అంటే ఏమిటో ఇవి గుర్తుచేస్తున్నాయి. సొంత దేశంలో గుర్తింపు కోసం ఇలా ఒక చిన్నారి వేడుకునే పరిస్థితి దేశంలో మరే పౌరుడికీ రాకూడదు" అని పేర్కొన్నారు.

మరొక నెటిజన్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. "పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ప్రజలు భారతీయ గుర్తింపును స్వీకరించేలా ఒప్పించడానికి మనం ఎంతో శక్తిని వెచ్చిస్తున్నాం. కానీ, ఈ దేశాన్ని అమితంగా ప్రేమిస్తూ, తాము భారతీయులమని గర్వపడే మన సొంత ఈశాన్య ప్రాంత పౌరులను మాత్రం చైనీయులు అంటూ దూరం చేసుకుంటున్నాం" అని రాసుకొచ్చారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story