Helicopter Proposal Viral : హెలికాప్టర్ ముందు ప్రపోజ్ చేశాడు.. కానీ తర్వాత ఏమైందంటే.?

Helicopter Proposal Viral : మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక యువ ఆర్మీ ఆఫీసర్ తన కాబోయే భార్యకు హెలికాప్టర్ ముందు మోకాళ్లపై..

G Krishna
Published on: 4 Jun 2026 11:35 AM IST
Helicopter Proposal Viral
X

Helicopter Proposal Viral

Helicopter Proposal Viral : మహారాష్ట్రలోని నాసిక్‌లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక యువ ఆర్మీ ఆఫీసర్ తన కాబోయే భార్యకు హెలికాప్టర్ ముందు మోకాళ్లపై నిలబడి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఈ మనసుకు హత్తుకునే దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే, నెటిజన్లు ఈ జంటను అభినందనలతో ముంచెత్తుతుంటే, ఆర్మీ సీనియర్ అధికారులు మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సైనిక నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై సదరు అధికారి ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నారు.

పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత ప్రపోజల్

ఆర్మీ ఏవియేషన్ పైలట్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న కెప్టెన్ భరత్ భరద్వాజ్, నాసిక్‌లోని కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (CAATS) లో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యాడు. పాసింగ్ అవుట్ పరేడ్ , కాన్వొకేషన్ ముగిసిన వెంటనే, భరత్ తన కాబోయే భార్య ఆరుషిని అక్కడ నిలిపి ఉంచిన ఒక సైనిక హెలికాప్టర్ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ అందరి ముందే మోకాళ్లపై నిలబడి ఆమెకు ఉంగరాన్ని బహుమతిగా ఇస్తూ ప్రపోజ్ చేశాడు. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు, తోటి అధికారులు , అతిథుల చప్పట్లు, కేరింతల మధ్య ఆరుషి ఆ ప్రతిపాదనను అంగీకరించింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

హెలికాప్టర్ ముందు ఈ జంట ఆలింగనం చేసుకున్న భావోద్వేగ భరితమైన వీడియోలు, ఫోటోలు సాషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు దీనిని ఎంతో అద్భుతమైన క్షణమని, వృత్తిపరమైన విజయానికి, వ్యక్తిగత ఆనందానికి ఇదొక చక్కని కలయిక అని ప్రశంసించారు.

వివరణ కోరిన ఆర్మీ అధికారులు

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చ కావడంతో ఆర్మీ సీనియర్ అధికారులు దీనిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించారు. రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. సదరు యువ అధికారి పలు సర్వీస్ రూల్స్ , రెగ్యులేషన్స్‌ను ఉల్లంఘించడంతో, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సీనియర్ అధికారులు ఆదేశించారు. అధికారి ఉద్దేశాన్ని ఆర్మీ గౌరవించినప్పటికీ, ఈ ప్రపోజల్‌కు ఎంచుకున్న సమయం, వేదిక ఏమాత్రం సరికాదని అధికారులు భావిస్తున్నారు.

ముందస్తు హెచ్చరిక.. కౌన్సిలింగ్

సైనిక పరికరాలు, ఆస్తులను వ్యక్తిగత సోషల్ మీడియా కంటెంట్ కోసం లేదా రీల్స్ కోసం ఉపయోగించకూడదనే కఠినమైన మార్గదర్శకాలు ఆర్మీలో ఉన్నాయి. అయితే, ఈ అధికారి చేసిన తప్పు పెద్ద నేరం కానందున, ప్రస్తుతానికి అతనిపై ఎలాంటి కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేదు. కానీ, సర్వీస్ రూల్స్, ఒక ఆర్మీ ఆఫీసర్‌కు ఉండాల్సిన ప్రవర్తనా నియమావళి , వృత్తిపరమైన బాధ్యతలపై అతనికి అవగాహన కల్పించి, హెచ్చరించాల్సిందిగా అతని పైఅధికారులను కోరారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story