Allu Arjun : అల్లు అర్జున్ చేసిన గొప్ప పని.. క్యాన్సర్ చిన్నారికి బన్నీ సర్‌ప్రైజ్.!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తన మంచి మనసుతో అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు...

G Krishna
Published on: 20 Jun 2026 10:22 AM IST
Allu-Arjun
X

Allu-Arjun

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తన మంచి మనసుతో అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన ఒక క్యాన్సర్ (లుకేమియా) బాధిత చిన్నారి కలని నెరవేర్చి అందరి హృదయాలను గెలుచుకున్నారు. 'మేక్-ఎ-విష్ ఫౌండేషన్' (Make-A-Wish Foundation) ద్వారా శ్రద్ధ అనే చిన్నారి తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్‌ను కలవాలనే కోరికను వ్యక్తపరిచింది. ఈ విషయం తెలుసుకున్న బన్నీ, బిజీ షెడ్యూల్‌లోనూ సమయం కేటాయించి ఆ పాపను కలిసి ఒక మధురమైన జ్ఞాపకాన్ని అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"ఝుకేగా నహీ సాలా".. చిన్నారితో పుష్ప మ్యాజిక్..

ఈ స్పెషల్ ఇంటారక్షన్ లో అల్లు అర్జున్ ఆ చిన్నారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. పాప ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా, ఆ చిన్నారి ముఖంలో సంతోషం చూడటం కోసం తన ఐకానిక్ సినిమా 'పుష్ప' లోని ఫేమస్ డైలాగ్ "ఝుకేగా నహీ సాలా" ను రీ-క్రియేట్ చేసి చూపించారు. దాంతో ఆ పాప ముఖంలో ఒక్కసారిగా వెయ్యి వోట్ల వెలుగు, పెద్ద చిరునవ్వు వచ్చేసింది. అంతేకాదు, "నువ్వు త్వరగా కోలుకున్నాక హైదరాబాద్ రా.. మనం మళ్లీ కలుద్దాం" అంటూ బన్నీ ఆ చిన్నారికి ప్రత్యేక ఆహ్వానం పలికారు.

సమాజం పట్ల బాధ్యత.. సెలబ్రిటీ అడ్వకేట్‌గా బన్నీ

అల్లు అర్జున్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, సమాజం పట్ల కూడా తన బాధ్యతను చాటుకుంటున్నారు. ఆయన 'మేక్-ఎ-విష్ ఫౌండేషన్' తో సెలబ్రిటీ అడ్వకేట్‌గా కలిసి పనిచేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న ఎంతోమంది చిన్నారుల ముఖాల్లో ఆనందం నింపడానికి, వారి కోరికలను తీర్చడానికి బన్నీ ఎల్లప్పుడూ ముందుంటారు. తనకున్న స్టార్‌డమ్‌ను ఇలాంటి మంచి పనులకు ఉపయోగించడం పట్ల నెటిజన్లు, ఆయన అభిమానులు బన్నీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

లైన్ లో క్రేజీ ప్రాజెక్ట్స్.. 'పుష్ప 3' కూడా!

ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్నారు. ఆయన రాబోయే ప్రాజెక్ట్స్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న 'రాకా' (Raaka) సినిమాలో బన్నీ హీరోగా నటిస్తుండగా, ఇందులో దీపికా పడుకోణె కీలక పాత్రలో కనిపించనుంది. దీనితో పాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'AA23', అలాగే పుష్ప సిరీస్‌లో రాబోయే 'పుష్ప 3: ది రాంపేజ్' (Pushpa 3: The Rampage) చిత్రాలు కూడా లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలతో బన్నీ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story