Sircilla: నీట్ లీకేజీపై సిరిసిల్లలో యూత్ కాంగ్రెస్ భారీ ధర్నా.
Sircilla: మానేరుబ్రిడ్జిపై నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
Sircilla: నీట్ లీకేజీపై సిరిసిల్లలో యూత్ కాంగ్రెస్ భారీ ధర్నా.
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు బ్రిడ్జిపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పెద్ద సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మానేరు బ్రిడ్జిపై ధర్నాకు దిగడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనాలు నిలిచిపోయాయి.
కేంద్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు.
దీనివల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు




