Dubbaka: రాజకీయాల్లో విజయ్ ప్రళయం.. దుబ్బాకలో టీవీకే సంబరాలు!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో తమిళనాడు వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి చిత్రపటాన్ని ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు.
Dubbaka: రాజకీయాల్లో విజయ్ ప్రళయం.. దుబ్బాకలో టీవీకే సంబరాలు!
సిద్దిపేట జిల్లా: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట 9వ వార్డులో TVK పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి చిత్రపటాన్ని ఆవిష్కరించి. తమిళనాడులో టీవీ కె పార్టీ ఘన విజయం సాధించినందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం రమేష్ మాట్లాడుతూ.. తమిళనాడు తలరాతను మార్చిన మొనగాడు పొగరుబోతుల అంచులను రాలగొట్టిన మగాడు విజయ్ దళపతి అన్నారు. తమిళనాడులో రాజకీయ పార్టీలకు వణుకు పుట్టించిన నేత విజయ్ దళపతి రాజకీయ పార్టీల చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు కళైజ్ఞర్ వెనుక నిలబడిన ఆ నిశ్శబ్ద, అమాయక బాలుడు(TVK పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి) ఒకనాడు తమిళనాడులో డీఎంకేను, చివరికి తన సొంత కొడుకునే ఓడిస్తాడని ఎవరు ఊహించి ఉంటారు? జీవితం విచిత్రమైనది, రాజకీయాలు మరింత విచిత్రమైనవి. అని 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్ అన్నారు.




