Dubbak: దుబ్బాకలో విషాదం.. పాము కాటుతో వృద్ధురాలు మృతి
Dubbak: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో విషాదం. రేకుల షెడ్డులో కట్టెలు తీస్తుండగా పాము కాటుకు గురై వృద్ధురాలు మృతి.
Dubbak: దుబ్బాకలో విషాదం.. పాము కాటుతో వృద్ధురాలు మృతి
Dubbak: రేకుల షెడ్డులో నిల్వ కట్టెలను తీస్తుండగా పాము కాటుకు గురై వృద్ధురాలు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మం డలం రామక్కపేట గ్రామంలో చోటుచేసుకుంది.
దుబ్బాక ఎస్ఐ కే. కీర్తి రాజు తెలిపిన రామక్కపేటకు చెందిన గంగల లక్ష్మి (60) అనే వృద్ధురాలు కుమారులతో ఇద్దరు కలిసి జీవనం కొనసాగిస్తుంది. తన ఇంటి ముందు గల రేకుల షెడ్డులో నిల్వ ఉంచిన కట్టెలను పైకితీస్తున్న క్రమంలో గుర్తు తెలియని పాము ఆమె కుడి చేతిపై కాటు వేసింది.
వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను దుబ్బాక వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ వృద్ధురాలు లక్ష్మి మృతి చెందింది. మృతురాలి కుమారుడు చంద్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




