Siddipet: అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా చూడాలి: కాంగ్రెస్ పీఏసీ నేతల పిలుపు!
Siddipet: ఓటరు జాబితా సవరణలో అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని మెదక్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో పార్టీ అగ్రనేతలు స్పష్టం చేశారు.
Siddipet: అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా చూడాలి: కాంగ్రెస్ పీఏసీ నేతల పిలుపు!
సిద్ధిపేట: ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో సిద్ధిపేట నియోజకవర్గంలో అర్హులైన వారి ఓట్లు తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ స్థాయి ఏజెంట్లపై ఉంది అని పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి దామోదర రాజనర్సింహ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
ఈరోజు మెదక్ లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీకి సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు ముఖ్య నాయకులతో కలిసి సమావేశంకు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రి దామోదర రాజనర్సింహ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు బూత్ ఏజెంట్లను మరింత క్రియాశీలకంగా పనిచేయాలి అని అన్నారు.
ఉపాధి పని కోసం ఇతర గ్రామాలకు వలస వెళ్లినవారు పేదలు ఇతర బలహీన వర్గాల ఓటు హక్కు కోల్పోకుండా ప్రత్యేకంగా పరిశీలించాలి అని అన్నారు. ఓటరు జాబితాలో పేర్లు చిరునామాలు ఇతర వివరాల్లో ఉన్న తప్పులను సరిచేయడానికి చర్యలు తీసుకోవాలి అని అన్నారు. సిద్ధిపేటలో నామినేటెడ్ పోస్టుల ఖాళీ వివరాలపై ఆరా తీసిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు త్వరగా నామినేటెడ్ పదవులు అర్హులైన పార్టీ నాయకులకు ఇవ్వాలి అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు అని నాయకులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అందేలా నాయకులు కార్యకర్తలు చొరవ చూపాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షుడు రషద్. విజయ డానియల్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.




