Dubbaka: తిమ్మాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.
Dubbaka: తిమ్మాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
దుబ్బాక: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎన్నారై ఈజీఎస్ నిధులతో రైతు గోదాం, మహిళా మండలి భవనాలకు భూమి పూజ గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తిమ్మాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఘనంగా భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నారై ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంకుస్థాపనలు జరిగాయి.
గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతులు, మహిళలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామంలోని ఐకెపి రైతుల సౌకర్యార్థం రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతు గోదాం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.
రైతులు పండించిన ధాన్యం మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు ఈ గోదాం ఉపయోగపడనుంది.




