Thoguta: తొగుట నూతన ఎస్సై నవీన్‌కు తుక్కాపూర్ గ్రామస్థుల ఘన సన్మానం!

Thoguta: సిద్దిపేట తొగుట పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ (SI) గా బాధ్యతలు స్వీకరించిన నవీన్‌ను తుక్కాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 25 Jun 2026 8:25 AM IST
Thoguta
X

Thoguta: తొగుట నూతన ఎస్సై నవీన్‌కు తుక్కాపూర్ గ్రామస్థుల ఘన సన్మానం!

Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ (SI) నవీన్ ను తుక్కాపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సన్మానించి నూతన బాధ్యతలకు గాను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎస్సై నవీన్ గారు మాట్లాడుతూ.. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని గ్రామ ప్రజాప్రతినిధులు ఆయనకు హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు ఈ సన్మాన కార్యక్రమంలో తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి చిక్కుడు (మాష్టి) కళావతి స్వామి ముదిరాజ్, ఉప సర్పంచ్ శ్రీమతి బోయిని కవిత బాలరాజ్ ముదిరాజ్, వార్డు సభ్యులు బోయిని పద్మ లక్ష్మణ్ ముదిరాజ్ , గొడుగు శ్రీశైలం ముదిరాజ్ పాల్గొన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story