Mirudoddi: ఆ చౌరస్తాకు వెళ్లాలంటేనే వణుకుతున్న వాహనదారులు!

Mirudoddi: మిరుదొడ్డి మండలం ధర్మారం చౌరస్తా మృత్యుకూడలిగా మారుతోంది. 765DG జాతీయ రహదారిపై అతివేగం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

Chindam Karunakar, Dubbak
Published on: 12 May 2026 10:11 AM IST
Mirudoddi
X

Mirudoddi: ఆ చౌరస్తాకు వెళ్లాలంటేనే వణుకుతున్న వాహనదారులు!

మిరుదొడ్డి: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం మీదుగా వెళ్తున్న 765DG నేషనల్ హైవే ఇప్పుడు ప్రయాణికులకు శాపంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ హైవేపై ధర్మారం చౌరస్తా ప్రాణాలు తీసే యమపాశంగా తయారైంది. అతివేగంతో దూసుకొస్తున్న భారీ వాహనాలు, సరైన రక్షణ చర్యలు లేని చౌరస్తాతో ప్రయాణికుల, వాహనదారుల ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నాయి. వరుస ఘటనలతో కుటుంబాల్లో కన్నీళ్లు మిగులుతున్నాయి.గత కొద్ది కాలంగా ఈ చౌరస్తా వద్ద ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. రెండు నెలల క్రితం లింగుపల్లికి చెందిన గంగయ్య బస్సు దిగి రోడ్డు దాటుతుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. తాజాగా గడిచిన ఆదివారం సాయంత్రం దుబ్బాకకు చెందిన పోచయ్య అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story