Cheriyal: చేర్యాలలో భక్తిశ్రద్ధలతో పోచమ్మ, మైసమ్మ బోనాలు!
Cheriyal: సిద్దిపేట జిల్లా చేర్యాలలో శ్రావణ మాసం చివరి ఆదివారం సందర్భంగా భక్తిశ్రద్ధలతో పోచమ్మ, మైసమ్మ అమ్మవార్లకు బోనాల సమర్పణ.
Cheriyal: చేర్యాలలో భక్తిశ్రద్ధలతో పోచమ్మ, మైసమ్మ బోనాలు!
Cheriyal: చేర్యాల పట్టణ కేంద్రం లో ఈ రోజు ఉదయం నుండి ప్రత్యేకంగా మహిళలు ఇంటి వద్ద అమ్మవార్లకు బోనం వండి కుటుంబ సమేతంగా తీసుకోని వెళ్లి కుడి చెరువు వద్ద నెలకొన్న పోచమ్మ అమ్మవారి కి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కి నైవేద్యం గా బోనం సమర్పించారు.
అమ్మవారికి ఎదురుగా నిలబడి తమ కోరికలు నిరవేరాలని వర్షాలు సమృద్ధిగా కురువాలని పాడి పంటలు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, కొంత మంది మేక పిల్లలను కోళ్లను కోసి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం రాజీవ్ నగర్ లో ఉన్న మైసమ్మ కు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
Next Story




