Dubbak: ఎస్ఐఆర్ ప్రక్షాళనతో అనర్హుల ఓట్ల తొలగింపు: సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి!

Dubbak: సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసన్‌పల్లిలో ఎస్ఐఆర్ ఓటరు జాబితా ప్రక్షాళనపై సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 27 Aug 2026 9:17 PM IST
Dubbak
X

Dubbak: ఎస్ఐఆర్ ప్రక్షాళనతో అనర్హుల ఓట్ల తొలగింపు: సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి!

దుబ్బాక: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పెద్ద మాసన్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ఓటర్లు ఓటర్ జాబితాలో ఎస్ఐఆర్ ప్రక్షాళనలో తొలగిపోతే వెంటనే తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు.

ఓటర్ల జాబితాలలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తుందన్నారు.

స్మార్ట్ రేషన్ కార్డుల కోసం కేటాయించిన నిధులను గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పెద్దమాసాన్ పల్లి గ్రామ, ఉపసర్పంచ్ బోయిన శ్రీనివాస్, కార్యదర్శి అమరేందర్, జిపిఓ నవీన్, గ్రామ ప్రజలు మరియు విలేజ్ అధికారులు పాల్గొనడం.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story