Dubbak: సర్పంచ్ కవిత స్వామి గౌడ్ అధ్యక్షతన విజయవంతంగా గ్రామసభ!

Dubbak: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో సర్పంచ్ బండారి కవిత స్వామి గౌడ్ అధ్యక్షతన ఓటరు జాబితా (SIR) పై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.

KARUNAKAR,	DUBBAK
Published on: 27 Aug 2026 9:04 PM IST
Dubbak
X

Dubbak: సర్పంచ్ కవిత స్వామి గౌడ్ అధ్యక్షతన విజయవంతంగా గ్రామసభ!

దుబ్బాక: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ బండారి కవిత స్వామి గౌడ్ గారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించబడింది. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా (SIR) పై సమగ్రంగా చర్చించడం జరిగింది.ఓటరు జాబితాలో ఉన్న మరణించిన వ్యక్తుల పేర్ల తొలగింపు.

అర్హత కలిగిన నూతన ఓటర్ల నమోదు, ఓటరు వివరాల్లో తప్పుల సవరణ తదితర అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించి, వారి అభ్యంతరాలు మరియు సూచనలను స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేందర్, పంచాయతీ కార్యదర్శి రవీందర్, GPO వెంకటేశం, BLOలు జ్యోతి మరియు వీణ, గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామ సభ విజయవంతంగా నిర్వహించబడింది.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story