Siddipet: ఈజీ మనీ కోసం వరుస హత్యలు.. తల్లి, కొడుకు అరెస్ట్!

Siddipet: సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

RAJU, SIDDIPET
Published on: 16 Aug 2026 7:15 PM IST
Siddipet
X

Siddipet: ఈజీ మనీ కోసం వరుస హత్యలు.. తల్లి, కొడుకు అరెస్ట్!

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈజీ మనీకి అలవాటు పడిన తల్లి, కొడుకు కలిసి మహిళలను టార్గెట్‌గా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఒక హత్య కేసు విచారణలో మరో హత్య వెలుగులోకి రావడంతో పాటు.. గతంలో జరిగిన దోపిడీ ఘటన కూడా బయటపడింది. అంతేకాదు.. మరో నలుగురిని హత్య చేసేందుకు కూడా నిందితులు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన కథనం ప్రకారం అక్బర్‌పేట-భూంపల్లి మండలం రామక్కపేట గ్రామ శివారులో వారం రోజుల క్రితం ఓ మహిళ మృతదేహం కాలిపోయిన స్థితిలో పోలీసులకు కనిపించింది.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతురాలిని అక్బర్‌పేట-భూంపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి చెందిన అథికం విజయ, 45 సంవత్సరాలుగా గుర్తించారు. కేసును సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, క్రైమ్ పోలీసు బృందాలు కలిసి దర్యాప్తు చేయగా.. నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అదే డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో కిరాణా షాపు నిర్వహిస్తున్న చాకలి రజిత, తన మైనర్ కుమారుడి సహాయంతో విజయను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story