Siddipet: తొగుట పోలీసుల పిలుపు ఉద్యోగ మిత్ర తో నిరుద్యోగులకు బంపర్ ఆఫర్!

Siddipet: సిద్దిపేట జిల్లా తొగుటలో 'పోలీస్ ఉద్యోగ మిత్ర' మరియు 'నిఘా నేత్ర' కార్యక్రమాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 11 April 2026 1:08 PM IST
Siddipet
X

Siddipet: తొగుట పోలీసుల పిలుపు ఉద్యోగ మిత్ర తో నిరుద్యోగులకు బంపర్ ఆఫర్!

Siddipet: సిద్దిపేట కమీషనర్ అఫ్ పోలీస్ ఎంతో ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన " *పోలీస్ ఉద్యోగ మిత్ర(జాబ్ మేళా), మన పోలీస్ మన ఊరు, సిద్దిపేట నిఘా నేత్ర కార్యక్రమాల సిద్దిపేట జిల్లా తొగుట PS నందు తొగుట CIP SK. లాతీఫ్ గారు, తొగుట SIP V. రవికాంత్ రావ్ గార్లు తొగుట మండలం పరిధిలో గల సర్పంచ్ మరియు ఉప - సర్పంచ్ లతో సమావేశం ఏర్పాటు చేసి పోలీస్ ఉద్యోగ మిత్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత అందరు ఉద్యోగ మిత్ర QR కోడ్ ద్వారా తమ యొక్క వివరాలు నమోదు చేసుకొని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు అని తెలిపినారు.

మన పోలీస్ - మన ఊరు మరియు సిద్దిపేట పోలీస్ నిఘా నేత్ర కార్యక్రమాలలో భాగంగా ప్రతి గ్రామంలో CCTV కెమెరాల ఏర్పాటులో తమవంతు సహాయ సహకారాలు అందించాలని సర్పంచ్ మరియు ఉప- సర్పంచ్ లకు సూచించారు. అలాగే గ్రామంలో యువత మద్యానికి, మత్తు పదార్థాల బారిన పడకుండా అందరు కృషి చేయాలని యువత క్రీడలవైపు మళ్లేల సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్బంగా తెలిపినారు.

అదేవిదంగా అందరు VPO లు గ్రామంలో cctv కెమెరాల ఏర్పాటుకు గ్రామంలోని ప్రజలను భాగస్వామ్యం చేయాలనీ, ప్రతి VPO గ్రామలో సమావేశం ఏర్పాటు చేయాలి.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story