Siddipet: చేయూత కొత్త పింఛన్ల దరఖాస్తుకు ఈనెల 31 చివరి తేదీ

Siddipet: సిద్దిపేట జిల్లాలో చేయూత పథకం కింద కొత్త సామాజిక భద్రతా పింఛన్ల దరఖాస్తుల గడువు ఆగస్టు 31తో ముగుస్తుందని కలెక్టర్ హైమావతి తెలిపారు.

RAJU, SIDDIPET
Published on: 28 Aug 2026 9:52 PM IST
Siddipet
X

Siddipet: చేయూత కొత్త పింఛన్ల దరఖాస్తుకు ఈనెల 31 చివరి తేదీ

సిద్దిపేట: చేయూత పథకం కింద కొత్త సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 31వ తేదీ చివరి తేదీ అని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ హైమావతి..

శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖ వారు జారీ చేసిన చేయూత సామాజిక భద్రత కొత్త పెన్షన్లు మంజూరు-2026 సంబంధించి గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత/చేనేత కార్మికులు, రక్తసంబంధిత దివ్యాంగులు, ఫైలేరియా వ్యాధి ద్వారా బాధపడేవారికి చేయూత అందించడం కోసం కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. అధికారిక వెబ్సైట్ లొ దరఖాస్తు స్వీకరణ గడువు చివరి తేదీ ఆగస్టు 31 ముగుస్తుందని తెలిపారు.

ఆన్లైన్ లో అప్లై చేసుకున్న దరఖాస్తులను గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీవో కార్యాలయంలో , పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ డిఆర్డిఓ రమేష్, అడిషనల్ డిఆర్డిఏ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story