Siddipet: 12 గంటల కరెంట్ కోసం భూంపల్లిలో రైతుల రాస్తారోకో!

Siddipet: వ్యవసాయానికి 12 గంటల కరెంట్ ఇవ్వాలని సిద్దిపేట జిల్లా భూంపల్లి చౌరస్తా వద్ద రైతులు, బీజేపీ రాస్తారోకో. వారం రోజుల్లో సమస్య తీర్చకుంటే డీఈ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిక.

KARUNAKAR,	DUBBAK
Published on: 11 Sept 2026 5:16 PM IST
Siddipet
X

Siddipet: 12 గంటల కరెంట్ కోసం భూంపల్లిలో రైతుల రాస్తారోకో!

సిద్దిపేట: 12 గంటల కరెంటు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం భూంపల్లి చౌరస్తా వద్ద రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో రైతులు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో సిద్దిపేటకు వెళ్లే ప్రజలు మరియు రామయంపేట వెళ్లే ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

అనంతరం వారు మాట్లాడుతూ వర్షాకాలం వరి పంటను సాగు చేస్తే ప్రభుత్వం సరిపడె కరెంటు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని, ఓ పక్క యూరియా కోసం యాపులు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ మరో పక్క కరెంట్ కోసం ప్రభుత్వం రైతులను ముప్పతిప్పలు పెడుతుందన్నారు. వారం రోజులలో అధికారులు కరెంటు సమస్యలను పరిష్కరించకుంటే సిద్దిపేట డిఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK