Siddipet: దొమ్మాట యూనియన్ బ్యాంకులో వడ్డీ వ్యాపారుల దందా!
Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాట యూనియన్ బ్యాంకులో వడ్డీ వ్యాపారుల దందా. క్రాప్ లోన్ రెన్యువల్ కోసం లక్షకు రూ.2 వేలు వసూలు.
Siddipet: దొమ్మాట యూనియన్ బ్యాంకులో వడ్డీ వ్యాపారుల దందా!
Siddipet: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం లోని దొమ్మాట యూనియన్ బ్యాంకులో వడ్డీ వ్యాపారుల హవా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రాప్ లోన్ రెన్యువల్, నగదు లావాదేవీల కోసం వచ్చే రైతులు, సామాన్యుల నుంచి నలుగురు వడ్డీ వ్యాపారులు అందినకాడికి దండుకుంటున్నారని వినియోగదారులు వాపోతున్నారు.
వ్యవ సాయం, కూలీ పనులపై ఆధారపడే పల్లె ప్రజలు తమ పనుల కోసం రోజువారీ ఉపాధిని కోల్పోయి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇదే పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు మధ్యవర్తులు, వడ్డీవ్యాపారులు రైతులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
క్రాప్ లోన్ రెన్యువల్ కోసం లక్ష రూపాయలకు రూ.2వేల వరకు వసూలు చేయడమే కాకుండా, నెల రోజుల వడ్డీ పేరిట అదనపు భారాన్ని మోపుతు న్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో పార్ట్ టైంగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ద్వారా కొందరు వడ్డీ వ్యాపా రులు తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు.




