Siddipet: రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: వొడితల సతీష్ కుమార్!

Siddipet: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హుస్నాబాద్ రైతు సదస్సులో డిమాండ్ చేశారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 4 Sept 2026 11:05 AM IST
Siddipet
X

Siddipet: రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: వొడితల సతీష్ కుమార్!

Siddipet: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి అన్నదాతలకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో రైతులతో కలిసి రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగ పరిస్థితులు, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై విస్తృతంగా చర్చించారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని సతీష్ కుమార్ అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అన్నదాతలను విస్మరిస్తే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. రైతులకు ప్రతి సంవత్సరం ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా అందిస్తామని ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు ఎలాంటి వివక్ష లేకుండా రైతు భరోసా అందించాలని కోరారు.

వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. రైతుతో పాటు వ్యవసాయ కూలీ కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగమని పేర్కొన్నారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అకాల వర్షాలు, వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పంట నష్టపరిహారం అందించాలని,రైతు భరోసా, రుణమాఫీ, 22A భూముల సమస్య, గౌరవెల్లి ప్రాజెక్టు, సాగునీరు, ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు, పంటలకు గిట్టుబాటు ధర, పంట నష్టపరిహారం వంటి సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని వొడితల సతీష్ కుమార్ స్పష్టం చేశారు.

“రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి. రైతుల భూములకు రక్షణ కల్పించాలి. గౌరవెల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.

ఈ రైతు సదస్సులో హుస్నాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story