Siddipet: మద్దూరు కేజీబీవీలో ఫుడ్ పాయిజన్, DYFI ఆందోళన

Siddipet: సిద్దిపేట జిల్లా మద్దూరు కేజీబీవీలో ఫుడ్ పాయిజన్‌తో 19 మంది విద్యార్థినులు అస్వస్థత. సమగ్ర విచారణ జరిపించాలని DYFI జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ డిమాండ్.

RAJU, SIDDIPET
Published on: 17 Aug 2026 5:37 PM IST
Siddipet
X

Siddipet: మద్దూరు కేజీబీవీలో ఫుడ్ పాయిజన్, DYFI ఆందోళన

సిద్దిపేట జిల్లా: మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో ఫుడ్ పాయిజన్ కారణంగా 19 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని DYFI సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందని పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు

అస్వస్థతకు గురైన విద్యార్థినులను చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా ఈ ఘటనకు కారణమైన హాస్టల్ ఎస్ ఓ పైన అధికారులు జిల్లా కలెక్టర్ గారు సమగ్ర విచారణ చేపట్టాలని, విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని, హాస్టల్‌లో పరిశుభ్రత మరియు భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా DYFI సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ, విద్యార్థినుల ఆరోగ్యంతో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించకూడదని, ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్‌లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి హాస్టల్ లలో ఫుడ్ పాయిజన్ లు పెరిగాయని పర్యవేక్షణ లోపించినది అని

విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నరని అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్ లలో తలిదండ్రులు అడ్మిషన్లు చేయించడం లేదని విమర్శించారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story