Dubbaka: ముఖ గుర్తింపుతో జీవన ధ్రువీకరణను సద్వినియోగం చేసుకోవాలి
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలక సంఘం పరిధిలో ఆసరా పింఛన్ల లబ్ధిదారుల కోసం నిర్వహిస్తున్న ముఖ గుర్తింపు జీవన ధ్రువీకరణ.
Dubbaka: ముఖ గుర్తింపుతో జీవన ధ్రువీకరణను సద్వినియోగం చేసుకోవాలి
Dubbaka: ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లను పొందే లబ్ధిదారులు ముఖ గుర్తింపుతో చేపట్టిన జీవన ధ్రువీకరణ (లైవ్ నెస్ అథెంటికేషన్ )ను సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలక కమిషనర్ కే. రమేష్ కుమార్ తెలిపారు. గురువారం దుబ్బాక పట్టణంలోని 17వ వార్డులో గల నీలకంఠ భజన మండలిలో ఆసరా పింఛన్దారుల కోసం ఏర్పాటుచేసిన ముఖ గుర్తింపు ప్రక్రియను 17వ వార్డు కౌన్సిలర్ ఎండి చాంద్ మియాతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల పింఛన్లను పొందుతున్న లబ్ధిదారులు ముఖ గుర్తింపుతో జీవన ధ్రువీకరణ ఇవ్వడం ద్వారా పింఛనుదారులను గుర్తించి, పింఛన్ల పంపిణీ జరిగేట్లు చర్యలు తీసుకుంటుందన్నారు. దుబ్బాక పురపాలికలో నేటి వరకు 8393 మంది పింఛన్దారులు ఉండగా, వారిలో 3424 మంది పింఛన్దారులకు ముఖ గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.మరణించిన వారి పింఛన్లను తొలగించేందుకే ప్రభుత్వము ముఖ గుర్తింపును అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.




