Siddipet: బాలసదనంలో కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు
Siddipet: సిద్దిపేట బాలసదనంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆధ్వర్యంలో విద్యార్థినులతో రాఖీ కట్టించుకుని మతసామరస్యం చాటారు.
Siddipet: బాలసదనంలో కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు
సిద్ధిపేట: సోదరభావానికి ప్రతీకగా రక్షాబంధన్ నిలుస్తున్నది అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు అన్నారు. సిద్ధిపేటలో రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోదరభావం మతసామరస్యం చాటుతూ సిద్ధిపేట బాలసదనంలో కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారి ఆధ్వర్యంలో విద్యార్థినీలతో ముస్లిం కాంగ్రెస్ నాయకులు రాఖీలు కట్టించుకున్నారు.
ఈ సందర్భంగా సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ గారు మాట్లాడుతూ రాఖీ ప్రాధాన్యతను వివరిస్తూ కులమతాలకు అతీతంగా సోదరభావంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. రక్షాబంధన్ భారతీయ సంస్కృతిలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది అని అయితే నేటి సమాజంలో ఇది మత సామరస్యం, సోదరభావం, పరస్పర గౌరవానికి కూడా ప్రతీకగా మారింది అని అన్నారు.
మహిళల రక్షణ గౌరవం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి అని అన్నారు. సిద్ధిపేటలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగ వేడుకలు జరుపుకుంటారు అని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక గౌరవం ఇస్తూ పెద్దపీట వేస్తున్నరు అని అన్నారు.
అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి కోసం మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ చైర్మన్ రైసోద్దీన్. గ్యాదరి మధు. వహాబ్ గయాజుద్దీన్. అర్షద్ హుస్సేన్. విజయ్ డానియల్. అజ్మత్ సుధీర్. తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




