Siddipet: బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులపై మెరుగు మహేష్ మండిపాటు

Siddipet: కాంగ్రెస్ ప్రభుత్వం అధికార మదంతో బీఆర్‌ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మెరుగు మహేష్ మండిపడ్డారు.

RAJU, SIDDIPET
Published on: 8 Sept 2026 9:54 PM IST
Siddipet
X

Siddipet: బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులపై మెరుగు మహేష్ మండిపాటు

సిద్దిపేట: కేంద్రంలో అప్పటి నీ ప్రభుత్వన్ని నీ సెంట్రల్ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించినోల్లం నువ్వో లెక్కన రేవంత్ రెడ్డి! ఫామౌజ్ ముట్టడిస్తామని నీతి మాలిన కాంగ్రెస్ నాయకులు కారుకూతలు కూస్తుంటే వాళ్లను అరెస్టు చేయాల్సింది పోయి బిఆర్ఎస్ నాయకులమైన మమ్ములను అరెస్టు చేయడమేమిటని ప్రభుత్వనీ మెరుగు మహేష్ ప్రశ్నించారు.

సిద్దిపేట పోలీసులు బిఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికార మదంతో నిరంకుశంగా వ్యవహరిస్తోందని మెరుగు మహేష్ ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు ఫామౌజ్‌ ముట్టడి చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తుంటే వారిని అరెస్టు చేయకుండా, బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ నాయకులను రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమంగా అరెస్టులు చేయడం సరికాదని ఆయన అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలని చూస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పోరాట పటిమతో ముందుకు సాగిన నాయకులం అని, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఉందని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మెరుగు మహేష్ అన్నారు. ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తే అది మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పటి కేంద్ర కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, మెడలు వంచి ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తక్కువ అంచనా వేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.ఫామౌజ్‌ ముట్టడి చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వారిని ప్రశ్నించకుండా బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేయడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మెరుగు మహేష్ విమర్శించారు.

ప్రతిపక్ష నాయకుల అరెస్టులతో ప్రజాస్వామ్య గొంతుకను అణచివేయలేరని, ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అరెస్టు ఐన వారిలో బిఆర్ఎస్ మాజీ ఎంపీటిసి బండి రంగయ్య, మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ లు వున్నారు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET

Next Story