Siddipet: బైరాన్‌పల్లిలో అమరవీరులకు ఐద్వా నేతల ఘన నివాళి
Siddipet: సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం బైరాన్‌పల్లిలో ఐద్వా ఆధ్వర్యంలో ఘనంగా స్ఫూర్తి యాత్ర. అమరవీరులకు నివాళులర్పించిన ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి.
Siddipet: బైరాన్‌పల్లిలో అమరవీరులకు ఐద్వా నేతల ఘన నివాళి
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా దూల్మిట్టమండలం తెలంగాణ రైతాంగ సాయిధ పోరాటంలో అమరులైన వీరవనితల లను స్మరించుకుంటూ ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్ఫూర్తి యాత్ర మంగళవారం పాలకుర్తిలో ప్రారంభమై కడవెండి నుండి వీరా బైరాన్ పల్లి చేరుకోవడం జరిగింది.
స్ఫూర్తి యాత్రకు ఐద్వా జిల్లా కమిటీ గ్రామాలలో వారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా బైరాన్ పల్లి బురుజు వద్ద అమరవీరులకు నివాళులర్పించి అనంతరం జరిగిన సభలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ, మాట్లాడుతూ..తెలంగాణ ప్రాంతంలో 1946-51 వరకు జరిగిన పోరాటంలో ఎందరో మహిళలు వీరవనితలు అమరులయ్యారని నిజం కాలంలో బైరాన్ పల్లి బురుజు వద్ద మహిళలపై అగైత్యాలు చేసి అత్యాచారాలు మహిళల ఒంటిపైన వస్త్రాలను తొలగించి శవాల చుట్టూ బతుకమ్మ ఆడించిన ఘటన ఆనాడు జరిగిందని.
నిజాం రజాకార్లకు భూస్వాములకు వ్యతిరేకంగా మహిళలు ఇంటికే పరిమితం కాకుండా చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో మరింత తెగింపుతో వీరవనితల్లాగా ఉద్యమించి నిజాం రజాకారుల గుండెల్లో గుబులు పుట్టించే పోరాటాలు నిర్వహించిన గడ్డా ఈ బైరాన్ పల్లి గడ్డ అని ఆమె గుర్తు చేశారు. వారు సాధించినటువంటి పోరాట ఫలితం నేటి సమాజంలో ఉన్న మహిళ మహిళలకు స్ఫూర్తిదాయకమని వారి ఆశయాలు కొనసాగించడానికి ఐద్వా ఆధ్వర్యంలో ముందుకు కొనసాగుతామని ఆమె తెలిపారు.
ఈ స్ఫూర్తి యాత్రలో రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, ఉపాధ్యక్షురాలు ఆశాలత, బుగ్గ వీటి సరళ, బండి పద్మ, మేరుకు రమణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన, కార్యదర్శి అత్తిని శారద, సహాయ కార్యదర్శి జాలీగాకు శిరీష , ఇపకాయల శోభ , నాయకురాలు విగ్నేశ్వరి, చంద్రకళ, శోభ తదితరులు పాల్గొన్నారు.




