Siddipet: గణేష్ మండపాల నిర్వహణకు ఆన్-లైన్ సమాచారం తప్పనిసరి

Siddipet: హుస్నాబాద్‌లో గణేష్ మండపాల ఆన్‌లైన్ సమాచారం పూర్తిగా ఉచితం. బందోబస్తు కోసం వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలని ఏసీపీ సదానందం సూచన.

CH SRINIVAS, HUSNABAD
Published on: 11 Sept 2026 8:33 PM IST
Siddipet
X

Siddipet: గణేష్ మండపాల నిర్వహణకు ఆన్-లైన్ సమాచారం తప్పనిసరి

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పోలీసు శాఖ వారు రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ మరియు మండపం నకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందించిందని అని, ఈ యొక్క సమాచారం ద్వారా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందని , ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ కు ఎటువంటి రుసుము లేదని హుస్నాబాద్ ACP S. సదానందం తెలిపారు.

గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయుటకు ముందు, ముందస్తు సమాచారం పోలీసుస్టేషన్ లో సమాచారం ఇవ్వాలని అందుకోసం ఏదైనా కంప్యూటర్, మొబైల్ నందు అప్లై చేసుకోవాలి అని అన్నారు. అందుకొరకు http://policeportal.tspolice.gov.in అనే site నందు వివరాలు పొందు పరచి అప్లికేషన్ ను సంబంధిత పోలీస్ స్టేషన్ నందు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో హుస్నాబాద్ సీఐ శ్రీధర్ , ఎస్ ఐ లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD