Siddipet: మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి జైలు శిక్ష, జరిమానా

Siddipet: సిద్ధిపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన నలుగురికి 2 రోజుల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించిన న్యాయమూర్తి కాంతారావు.

RAJU, SIDDIPET
Published on: 16 Sept 2026 6:09 PM IST
Siddipet
X

Siddipet: మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి జైలు శిక్ష, జరిమానా

సిద్ధిపేట: సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు, తన సిబ్బందితో కలిసి నిన్నటి రోజు వాహనాలు తనిఖీ చేయగా ముగ్గురు లారీ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మరియు మద్యం సేవించి మోటార్ సైకిల్ నడుపుతూ ఒక వ్యక్తి పట్టుబడినాడు, వారిని ఈ రోజు సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి గారి ముందు హాజరుపరచగా విచారణ చేసి ముగ్గురు లారీ డ్రైవర్లకి మరియు మోటార్ సైకిలిస్ట్ కి 02 రోజుల జైలు శిక్ష తో పాటు రూ. 10,000/- జరిమానా విధించినారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ముత్యం రాజు మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనం నడుపరాదని, త్రాగి వాహనం నడపడం వలన తమ ప్రాణాలకి హాని జరగడమే కాకుండా ఇతరుల ప్రాణాలకి ముప్పు ఉన్నందున, రోడ్డు ప్రమాద రహిత సమాజం కోసం అందరూ బాధ్యత కలిగిన పౌరులుగా మెలగాలని అలాగే రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని ఒకవేళ మద్యం త్రాగి వాహనం నడుపుతూ పోలీస్ కి పట్టుబడితే రూ. 10,000/- మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే రూ. 5,000/- జరిమానా తో పాటు జైలు శిక్ష వంటి చట్టపరమైన కఠిన చర్యలకి భాద్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించరు.

RAJU, SIDDIPET

RAJU, SIDDIPET