Thoguta: శని దేవునికి 750 కిలోల నూనెతో అభిషేకం.. ఎక్కడో తెలుసా?
Thoguta: సిద్దిపేట జిల్లా తొగుట-రాంపూర్ లోని శ్రీ గురు మదనానంద సరస్వతీ పీఠంలో శనైశ్చర జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి.
Thoguta: శని దేవునికి 750 కిలోల నూనెతో అభిషేకం.. ఎక్కడో తెలుసా?
తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తొగుట–రాంపూర్ లోని శ్రీ గురు మదనానంద సరస్వతీ పీఠంలో పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శనైశ్చర జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శనిదేవుని నామస్మరణలతో పీఠం ప్రాంగణం మారుమోగిపోగా, భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక కాంతులతో నిండిపోయాయి.
ఈ మహోత్సవంలో భాగంగా శనైశ్చర స్వామి వారికి ఏకంగా 750 కిలోల నువ్వుల నూనెతో మహా తైలాభిషేకం నిర్వహించడం విశేషంగా నిలిచింది. ప్రత్యేక వేద మంత్రోచ్చారణల నడుమ జరిగిన అభిషేక కార్యక్రమం భక్తులను భక్తి భావంలో ముంచెత్తింది. ఉదయం నుంచే సంప్రదాయ దుస్తులతో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి పల్లకి సేవ అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారు ఆధ్యాత్మిక సందేశం ఇస్తూ.. “శని ప్రభావం మనిషికి కష్టాలను మాత్రమే కాదు, జీవితాన్ని సరిదిద్దుకునే గొప్ప అవకాశాన్ని కూడా ఇస్తుంది.




