Siddipet: బడికి వెళ్దామంటే.. అమావాస్య అడ్డంకి! సెంటిమెంట్లతో తగ్గిన హాజరు

Siddipet: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు సోమవారమే పునః ప్రారంభం కావాల్సి ఉన్నా, అమావాస్య, మంగళవారం సెంటిమెంట్ల కారణంగా విద్యార్థులు బడికి వెళ్లడం లేదు.

Chindam Karunakar, Dubbak
Published on: 15 Jun 2026 10:34 AM IST
Siddipet
X

Siddipet: బడికి వెళ్దామంటే.. అమావాస్య అడ్డంకి! సెంటిమెంట్లతో తగ్గిన హాజరు

Siddipet: తెలుగువారి ఇంట ఏ చిన్న ముచ్చట జరగా లన్నా ముందుగా పంచాంగమే చూస్తారు. ఇల్లు మారాలన్నా, కొత్త పనులు మొదలుపె ట్టాలన్నా తిథి, వార, నక్షత్రాలు కుదరా ల్సిందే.

అలాంటిది పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే చదువుకు శ్రీకారం చుట్టే వేళ, ముహూర్తం సరిగ్గా లేకపోతే తల్లిదండ్రుల మనసు అంగీకరిస్తుందా? రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ జీవోల ప్రకారం పాఠశాలలు సోమవారమే పునః ప్రారంభం కావాల్సి ఉన్నా, అమావాస్య, మంగళవారం సెంటి మెంట్లు బ్రేకులు వేస్తున్నాయి.

ప్రభుత్వ నిర్ణయానికి, తెలుగువారి క్యాలెండర్కు మధ్య జరుగుతున్న ఈ ఆసక్తికర పోరులో విద్యార్థులకు మాత్రం మరో మూడు రోజుల సెలవుల పండగ దొరికినట్లయింది.

వేసవి సెలవుల సందడి ముగిసి, పిల్లలు బడికి వెళ్తారని సంబరపడిన తల్లులకు క్యాలెండర్ గట్టి షాక్ ఇచ్చింది. సోమవారం (జూన్ 15) అమావాస్య కావడంతో, ఆ రోజున కొత్త పుస్త కాలు తీయడం లేదా కొత్త ప్రయాణాలు మొదలు పెట్టడం అపశకునమని చాలా మంది భావిస్తారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story