Siddipet: భూంపల్లి పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ తనిఖీ!

Siddipet: అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరిశీలించారు.

Chindam Karunakar, Dubbak
Published on: 15 Jun 2026 10:53 AM IST
Siddipet
X

Siddipet: భూంపల్లి పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ తనిఖీ!

సిద్దిపేట జిల్లా: అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ.శ్రీ బక్కి వెంకటయ్య పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు_విద్యార్థులకు సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించడంలో ప్రహరీ గోడ నిర్మాణం కీలకమని చైర్మన్ పేర్కొన్నారు.

పాఠశాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థుల భద్రత మరియు విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి కొనసాగుతుందని తెలిపారు.ఈ సందర్భంలో చైర్మన్ వెంకటయ్య గారితో పాటు సర్పంచ్ జన్నారెడ్డి,మాజీ ఉపసర్పంచ్ వడ్ల ప్రభాకర్,మాజీ ఎంపిటిసి ఉల్లెంగల నవ్య-నరేష్,పాఠశాలప్రధానోపాధ్యులు,ఉపాధ్యాయులు,ఇతరులు ఉన్నారు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story