Siddipet: సర్దార్ సర్వాయి పాపన్న బహుజన ఆత్మగౌరవ ప్రతీక: కలెక్టర్!
Siddipet: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక అని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి కొనియాడారు.
Siddipet: సర్దార్ సర్వాయి పాపన్న బహుజన ఆత్మగౌరవ ప్రతీక: కలెక్టర్!
సిద్దిపేట: సిద్దిపేట జిల్లా వెనుకబడిన అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని ఎన్సాన్ పల్లి వెళ్ళే మార్గం వద్దగల చౌరస్తా లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి మాట్లాడుతూ,సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఈయన చేసిన కృషి చరిత్రలో నిలిచింది. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ఓక ప్రతీక. నాటి కాలంలో అన్ని వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను కావాలని ప్రజాస్వామ్యక స్ఫూర్తితో చేసిన పోరాటం గొప్ప విషయం.
విశ్వ కీర్తి పొందిన ఆయన గొప్పదనాన్ని స్మరించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారీ సయ్యద్ రఫీ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, గౌడ సంఘ నాయకులు, మరియు తదితరులు పాల్గొన్నారు.




