Toguta: రాహుల్ గాంధీ జన్మదిన సందడి.. వెంకట్రావుపేటలో కేక్ కట్ చేసిన నేతలు!
Toguta: తొగుట మండలం వెంకట్రావుపేటలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.
Toguta: రాహుల్ గాంధీ జన్మదిన సందడి.. వెంకట్రావుపేటలో కేక్ కట్ చేసిన నేతలు!
Toguta: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దేశ ప్రజల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతున్న ప్రజానాయకుడని కొనియాడారు.
యువతకు ఆదర్శంగా నిలుస్తూ దేశ భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం మరిన్ని సేవలు అందిస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ రాహుల్ గాంధీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు బండారు రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు పంది రాజు, మండల ఉపాధ్యక్షులు బెజ్జనమైన అనిల్, ఆత్మ కమిటీ డైరెక్టర్ లు బెజ్జనమైన ప్రవీణ్ పాల్గొన్నారు.




