Dubbaka: అక్బర్‌పేట్ భూంపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Dubbaka: సిద్దిపేట జిల్లా భూంపల్లి, రామేశ్వరంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి.

KARUNAKAR,	DUBBAK
Published on: 31 Aug 2026 2:54 PM IST
Dubbaka
X

Dubbaka: అక్బర్‌పేట్ భూంపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన!

Dubbaka: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు,దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్-భూంపల్లి మండలంలోని రామేశ్వరంపల్లి మరియు భూంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు,దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.

ఈ సందర్భంగా ఎంపీ,ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు తరగతి గదులు, ఫర్నిచర్, ప్రహరీ గోడలు తదితర మౌలిక వసతుల సమస్యలను ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

ప్రభుత్వం అందించే నిధులతో పాటు సర్పంచులు, గ్రామ పెద్దలు, దాతలు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపితే ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.

KARUNAKAR,	DUBBAK

KARUNAKAR, DUBBAK

Next Story