Husnabad: రాముడి పేరు మీద బీజేపీ నేతలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు!

Husnabad: అయోధ్య రామాలయ విరాళాల్లో బీజేపీ కోట్ల అవినీతికి పాల్పడిందని, అందుకే అయోధ్య ప్రజలు వారిని ఓడించారని హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

CH SRINIVAS, HUSNABAD
Published on: 6 July 2026 10:33 AM IST
Husnabad
X

Husnabad: రాముడి పేరు మీద బీజేపీ నేతలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు!

హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జెల్లెలగడ్డలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ శ్రీ రామునికి రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి ఎవరి స్థితికి తగ్గట్టు విరాళాలు ఇచ్చారన్నారు.విరాళాల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, రాముని పేరు మీద, అక్షింతల మీద విరాళాలు బీజేపీ నాయకులు అడుక్కున్నారన్నారు.

బిజెపి నాయకుల అవినీతిని గుర్తించి అయోధ్య ప్రజలే అక్కడ బిజెపి ఎంపీని ఓడ కొట్టారని తెలిపారు.ఈ విషయంలో బిజెపి స్పందించి దేశ ప్రజలకు అందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.రాముని పేరును రాజకీయంగా ఎదగడానికి బిజెపి వాడుకుంది,రాజకీయం వేరు, భక్తి వేరు ఇది ఒక అవమానకరమైన విషయం అని,ఈ విషయంలో ప్రధాని మోడీ, అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి దే బాధ్యత వహించాలన్నారు.రాముడి హుండీలోనీ, విరాళాలను ఎత్తుకెళ్లడం ఈ దేశ ప్రజలకు అవమానకరం,రాముడికి ఇది పెద్ద అవమానo జరిగిందన్నారు.

భక్తి పేరు మీద, రాముని పేరు మీద రాజకీయం చేసే వారి రంగును ప్రజలు గుర్తించాలని కోరారు.రాష్ట్రంలో అక్షింతలు పంచి, విరాళాల పేరుతో పైసలు పట్టుకుపోయిన వారు స్పందించాలి,

దేవుడి పేరు మీద జరిగిన స్కాం, ఇవాళ ఆఖరకు దేవుడి పేరు మీద స్కాం చేసిన పార్టీ బిజెపి పార్టీ అని అన్నారు.

మజ్లిస్ పేరు తీయనిది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గెలవడని ఎద్దేవా చేశారు.

CH SRINIVAS, HUSNABAD

CH SRINIVAS, HUSNABAD

Next Story