Siddipet: ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవు: సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి
Siddipet: సిద్దిపేట జిల్లా పెద్ద మాసంపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి. రైతులకు అండగా ఉంటామని హామీ.
Siddipet: ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేవు: సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి
సిద్దిపేట జిల్లా: తొగుట మండలంలోని పెద్ద మాసంపల్లి గ్రామంలోని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉపసర్పంచ్ బోయిని శ్రీనివాస్ తో కలిసి గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొందరు నాయకులు రైతుల ముసుగులో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాదాపు గ్రామం నుండి 20 లారీల వరకు వరి ధాన్యాన్ని మిల్లర్లకు తరలించడం జరిగిందని తెలిపారు. కొందరు గ్రామంలో కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్న నిర్వాహకులపై ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ప్రతిరోజు అధికారులకు ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని కోరడం జరుగుతుందన్నారు. మండలంలోని ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామం నుండి వరి ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయన్నారు.




