Mirudoddi: అయ్యో పాపం బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా మృత్యువు కబళించింది
Mirudoddi: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేపల్లి గ్రామానికి చెందిన సంజీవరావు మృతి చెందారు.
Mirudoddi: అయ్యో పాపం బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా మృత్యువు కబళించింది
మిరుదొడ్డి: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం శివారులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఆరేపల్లి గ్రామానికి చెందిన గువ్వాడి సంజీవరావు అక్కడికక్కడే మృతి చెందాడు.సంజీవరావు బెజ్జంకిలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామం ఆరేపల్లికి వస్తుండగా ధర్మారం శివారులో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో బైక్ అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు.అటుగా వెళ్తున్న వాహనదారులు రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మిరుదొడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంజీవరావు మృతితో ఆరేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




