Mirudoddi: సమయస్ఫూర్తి చూపిన కానిస్టేబుల్‌కు ఎమ్మెల్యే సన్మానం!
Mirudoddi: మిరుదొడ్డి మండలంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన కానిస్టేబుల్ రాజును దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
Mirudoddi: సమయస్ఫూర్తి చూపిన కానిస్టేబుల్‌కు ఎమ్మెల్యే సన్మానం!
మిరుదొడ్డి: ఇటీవల చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ రాజును దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో శాలువాతో సత్కరించి అభినందించారు. మిరుదొడ్డి మండలంలో ఇటీవల ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ రాజు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమయస్ఫూర్తితో వ్యవహరించారు. చెరువులో నుంచి మహిళను బయటకు తీసి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.
"కానిస్టేబుల్ రాజు సమయస్ఫూర్తితో స్పందించి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడడం హర్షణీయం. పోలీస్ వ్యవస్థకు మంచి పేరు తెచ్చారు. ఇలాంటి సిబ్బంది అందరికీ ఆదర్శం. ప్రజల సేవలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారని నిరూపించారు." అంటూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందించారు. ఈ నేపథ్యంలో మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కానిస్టేబుల్ రాజును శాలువాతో సన్మానించారు.




