Toguta: ఎల్లమ్మ తల్లి కల్యాణంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

Toguta: సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో శ్రీ ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Chindam Karunakar, Dubbak
Published on: 26 May 2026 12:04 PM IST
Toguta
X

Toguta: ఎల్లమ్మ తల్లి కల్యాణంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

తొగుట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న శ్రీ ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ మహోత్సవాల్లో గౌరవ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పాల్గొననున్నారు.ఈరోజు మధ్యాహ్నం⏰ 2 గంటలకు ఎల్లమ్మ – జమదగ్ని కళ్యాణ మహోత్సవం లో ఎమ్మెల్యే గారు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఎల్లమ్మ తల్లి కటాక్షంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ప్రార్థించనున్నారు. కావున ఈ దైవిక కార్యక్రమానికి మండలంలోని గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎల్లమ్మ తల్లి భక్తులు, మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి.జీడిపల్లి రాంరెడ్డి. బి ఆర్ ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షులు.

Chindam Karunakar, Dubbak

Chindam Karunakar, Dubbak

Next Story